Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

Published : Jul 08, 2026, 11:29 AM IST

Gold Price Fall: రోజు బంగారం కొనే వాళ్లకు మార్కెట్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. వరుస రోజులుగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ఈరోజు కుప్పకూలింది. వెండి కూడా భారీగా తగ్గింది. ఎంత తగ్గిందంటే.. 

PREV
14
మరోసారి కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

మరోసారి బంగారం, వెండి ధరలు కుప్పకూలిపోయాయి. దీంతో పసిడి ప్రియులకు గొప్ప ఊరట దొరికింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు, అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి వంటి అంశాల ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈరోజు బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. 

24
రూ.1,44,490కు చేరిన బంగారం

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,44,490గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.770 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,32,450గా ఉండగా... ఒక్కరోజులోనే రూ.700 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల బాట పట్టింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,08,370గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.570 తగ్గింది. 

34
పతనమైన వెండి

వెండి మార్కెట్‌లో అయితే మరింత పెద్ద మార్పు కనిపించింది. కేవలం ఒక్కరోజులోనే కిలో వెండి ధర రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి వంటి కారణాలతో వెండి ధరల్లో ఈ మధ్య భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 

44
నిపుణుల సూచన

ఈరోజు నమోదైన తగ్గుదల కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా... రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మరోసారి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్‌ను నిశితంగా గమనించడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories