EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా వివాహం చేసుకున్న వారు లేదా త్వరలో పెళ్లి చేసుకోబోయే ఉద్యోగులు ఈ మార్పులను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
EPF స్కీమ్-2026 ప్రకారం, పెళ్లికి ముందు చేసిన నామినేషన్ వివాహం తర్వాత చెల్లుబాటు కాదు. అందుకే పెళ్లి జరిగిన వెంటనే కొత్త నామినేషన్‌ను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో PF క్లెయిమ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. పాత నామినేషన్‌పై ఆధారపడితే ప్రయోజనాల పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
25
జీవిత భాగస్వామినే నామినీగా పెట్టాలా?
చాలామంది పెళ్లి తర్వాత తప్పనిసరిగా భర్త లేదా భార్య పేరునే నామినీగా నమోదు చేయాలని భావిస్తుంటారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం అలాంటి తప్పనిసరి నిబంధన లేదు. కుటుంబం ఉన్న ఉద్యోగి తన కుటుంబంలోని ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చు. అవసరమైతే ఒక్కరికంటే ఎక్కువ మందికి నామినేషన్ ఇవ్వడంతో పాటు, వారికి ఎంత శాతం వాటా ఇవ్వాలనేది కూడా నిర్ణయించుకునే అవకాశం ఉంది.
35
నామినీగా ఎవరిని ఎంపిక చేయవచ్చు?
'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ-2020' ప్రకారం కుటుంబ సభ్యుల నిర్వచనాన్ని EPF స్కీమ్-2026లో అనుసరిస్తున్నారు. దీని ప్రకారం భర్త లేదా భార్య, చట్టబద్ధమైన లేదా దత్తత తీసుకున్న మైనర్ పిల్లలు, 21 ఏళ్లలోపు చదువుకుంటూ ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలు నామినీలుగా ఉండవచ్చు. అదే విధంగా అవివాహిత కుమార్తెలు, పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన దివ్యాంగ పిల్లలు కూడా అర్హులు. ఆర్థికంగా ఉద్యోగిపై ఆధారపడే తల్లిదండ్రులను కూడా నామినీలుగా చేర్చవచ్చు. మహిళా ఉద్యోగుల విషయంలో అత్త, మామలను కూడా కొన్ని షరతుల ప్రకారం నామినీలుగా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అవివాహిత ఉద్యోగికి తల్లిదండ్రులు లేకపోతే, అతనిపై ఆధారపడిన మైనర్ సోదరులు లేదా సోదరీమణులను కూడా నామినీలుగా నమోదు చేయవచ్చు.
ఉద్యోగి మరణించిన తర్వాత PF ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నామినేషన్ నిర్ణయిస్తుంది. అందుకే నామినేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మార్పులు చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వివాహం, కుటుంబంలో కొత్త సభ్యులు చేరడం లేదా ఇతర పరిస్థితులు మారినప్పుడు వెంటనే నామినేషన్‌ను అప్‌డేట్ చేయాలి. దీంతో భవిష్యత్తులో PF క్లెయిమ్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
55
కుటుంబం లేకపోతే ఎవరిని నామినీగా పెట్టొచ్చు?
కుటుంబ సభ్యులు లేని ఉద్యోగులు తమకు నచ్చిన ఏ వ్యక్తినైనా నామినీగా ఎంపిక చేసుకోవచ్చు. అయితే తర్వాత వివాహం జరిగి కుటుంబం ఏర్పడితే, కొత్త నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కుటుంబ సభ్యుల పేర్లతో మళ్లీ నామినేషన్ సమర్పించడం తప్పనిసరి. అందుకే ప్రతి EPF సభ్యుడు తన నామినేషన్ వివరాలు సరైనవేనా అని తరచూ పరిశీలించడం మంచిది.