Today Gold Rate: గోల్డ్ మార్కెట్లో గందరగోళం. ఊహించని విధంగా క్రాష్ అయిన ధరలు ఇప్పుడు కాస్త పుంజుకున్నాయి. వారం రోజులుగా పతనం దిశగా కొనసాగి…ఒక్కసారిగా బ్రేక్ పడింది. గతంలో మేలిమి పసిడి రేటుకు...ప్రస్తుత ధరకు రూ.30వేల వ్యత్యాసం కనిపిస్తోంది.
ఈ ఏడాది ఉగాది మామూలుగా లేదు. ఎందుకంటే బంగారం ధరలు అంతలా ఊరిస్తున్నాయి. వారం రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ అయోమయంలో మార్కెట్లు...వేలల్లో కుప్పకూలిపోయింది. దీంతో కొనుగోలుదారులు, మహిళలు సంతోషంలో మునిగిపోయారు. దీంతో గోల్డ్ మార్కెట్లు కళకళలాడిపోతున్నాయి.
ఉగాది రోజు కనీసం గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ చాలా మందిలో ఉంటుంది. ఆ రోజు కొనుగోలు చేస్తే సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్మకం. అయితే కొద్ది రోజుల క్రితం బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
24
పతనం దిశగా పడిపోయిన పసిడి
యుద్ధం కారణంగా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. హర్మూజ్ సంధి వివాదం ఇంకా కుదురుకోలేదు. ఎలాగైనా బంగారం రేట్లు పెరిగిపోతాయని అంతా ఆశించారు. కానీ ఏంటో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పుత్తడి, వెండి...క్రమంగా పతనమవుతూ వస్తోంది.
నిన్న మొత్తం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.7,140 తగ్గి రూ.1,50,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.6,550 పతనమై...రూ.1,37,750 వద్దకు చేరింది. వెండి కూడా రూ.10వేలు తగ్గి రూ.2.65లక్షలకు దిగింది.
34
మార్కెట్లో చిన్న ఛేంజ్..స్వల్ప పెరుగుదల
ఇప్పుడు మార్కెట్లో చిన్న ఛేంజ్ జరిగింది. ఇవాళ కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.650 తగ్గి రూ.1,50,930 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పతనమై...రూ.1,38,350 వద్దకు చేరింది. వెండి కూడా 2,64,900 వద్ద కొనసాగుతోంది. అయితే ఇది పెద్ద పెరుగుదల కాదని నిపుణులు అంటున్నారు. మొదట్నుంచి చూసుకుంటే...దాదాపు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ తగ్గింది. ఇది పెద్ద మార్పు కాదని నిపుణులు చెబుతున్నప్పటికీ… నిన్నటి భారీ పతనం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
పండుగ సీజన్‍లో ఇలా తగ్గడం కొనుగోలుదారులకు గోల్డెన్ అవకాశంగా మారింది. అయితే మార్కెట్ ఇంకా స్థిరపడలేదని, ఆచితూచి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండుగ అయిపోయిన వెంటనే ధరలు కాస్త పెరగడం...కొనుగోలుదారుల్లో కొంత కంగారు తెప్పిస్తోంది. గ్రాముపై రూ.65వేలు పెరిగింది. అంటే స్వచ్ఛమైన బంగారం గ్రాము రూ.15,093గా కొనసాగుతోంది.