Gold Rate Hike: బంగారం ధరలు తగ్గాయనుకుంటే భారీ ట్విస్ట్ నెలకొంది. ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో మార్కెట్ మొత్తం షేక్ అయిపోయింది. మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఫుల్ షాక్ లో ఉన్నారు.
దేశీయ బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువల్లో మార్పులు గోల్డ్ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
23
ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో మళ్లీ టెన్షన్
అమెరికా అధ్యక్షుడు Trump వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్ల దృష్టిని ఆకర్షించాయి. ఇరాన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఆయన ప్రకటించారు. అయితే ఒప్పందం కుదరకపోతే మరిన్ని దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించడం అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ టెన్షన్ పెంచింది.
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కనిపిస్తుండగా.. మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకపోవడంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే గోల్డ్ రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
33
పరుగులు పెడుతున్న వెండి
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరిగి రూ.1,59,930కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,46,600గా నమోదైంది. గత రెండు రోజుల పెరుగుదల తర్వాత కూడా మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గలేదు. ఇక వెండి ధరలు అయితే మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5,000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000 మార్క్‌ను టచ్ చేసింది. ఇటీవలే వెండి ధర రూ.3 లక్షల మార్క్ దాటేసింది.