మే 21 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1080 తగ్గి రూ.1,58,360గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.990 పతనమై రూ.1,45,160 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీ స్థాయిలోనే ఉంది. కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,510గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,310గా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ.2,79,900గా కొనసాగుతోంది.
ముంబై మార్కెట్‌లో కూడా బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,360గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,160గా ఉంది. వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.
ఇక చెన్నైలో మాత్రం బంగారం ధరలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,900గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,47,490గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,84,900గా నమోదైంది.