Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్. ఒక్కరోజులోనే పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటేసింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు… అంతర్జాతీయ మార్కెట్లలో టెన్షన్… దీంతో బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ఇక ముందు ఇంకా పెరుగుతాయా? లేక తగ్గుతాయా?
24
సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం మార్కెట్‌ను మళ్లీ వేడెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ మార్పిడి ఒత్తిళ్లు కలిసి బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు నేడు అమాంతం ఎగబాకింది.
34
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. నగరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,58,350కు చేరుకుంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,45,150 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 పెరిగి రూ.1,18,760గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ధరలు ఈ స్థాయిలో పెరగడం సామాన్య కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా యుద్ధ భయాలు, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి ధరలు త్వరలోనే మరోసారి కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలా? లేక మరికొంతకాలం వేచి చూడాలా? అన్న సందిగ్ధంలో కొనుగోలుదారులు ఉన్నారు.