Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇంకా తగ్గాయి. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..

Published : May 18, 2025, 01:10 PM IST

Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మే 18, 2025 న కూడా తగ్గాయి. గత కొంత కాలంలో బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. కొన్ని వారాలుగా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు అస్థిరంగా ఉండటంతో ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇంకా తగ్గాయి. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..

హైదరాబాద్‌లో బంగారం ధరలు:

దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో మే 18న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.95,130గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,200 (10 గ్రాములకు)గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.71,350 (10 గ్రాములకు)గా ఉంది. 

25

విజయవాడలో బంగారం ధరలు: 

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.93,920

22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.86,090

18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,350గా ఉంది. 

35

విశాఖపట్నంలో బంగారం ధరలు:

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.95,130

22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.87,200

18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,350గా నమోదైంది. 

45

ఈ ధరలు గత నెలతో పోలిస్తే కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు, ఏప్రిల్ 22, 2025 న MCXలో బంగారం ధర రూ.99,358 (10 గ్రాములకు) వద్ద గరిష్ట స్థాయిని చేరింది. అప్పటి నుండి సుమారు 7% తగ్గుదల నమోదైంది. విశ్లేషకుల ప్రకారం బంగారం ధరలు రూ.88,000 (10 గ్రాములకు) వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

55

ఈ ధరల తగ్గుదల వినియోగదారులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇంకా అస్థిరంగా ఉండటంతో, భవిష్యత్తులో ధరలు ఎలా మారతాయన్నది చెప్పడం కష్టం. అయితే ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు.

 

Read more Photos on
click me!