Gold Price: భారీగా ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌లు.. కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మా.? ఇంకా త‌గ్గుతాయా?

Published : Jul 27, 2025, 09:08 AM IST

బంగారం ధ‌ర‌ల్లో భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. అప్పుడే ర‌య్యిమ‌ని దూసుకుపోతున్న ధ‌ర ఒక్క‌సారిగా నేల‌చూపు చూస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆదివారం బంగారం ధ‌ర‌లో భారీగా త‌గ్గుద‌ల క‌నిపించింది. 

PREV
15
దిగొస్తున్న బంగారం

ఇటీవల చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ తులం బంగారం ధ‌ర రూ. ల‌క్ష దాటేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇక బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ ఆకాశాన్ని అంట‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ ప‌రిస్థితులు దానికి భిన్నంగా మారాయి. గ‌త రెండు రోజులుగా బంగారం ధ‌రలో మ‌ళ్లీ త‌గ్గుద‌ల క‌నిపించింది. ఆదివారం ఉద‌యం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,330 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ విష‌యానికొస్తే రూ. 91,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

DID YOU KNOW ?
అంత బంగారం తీశారా?
బంగారం కేవ‌లం ఆభ‌రంగాణే కాకుండా ప‌లు ఎల‌క్ట్రానిక్ వ‌స్తువ‌ల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1,60,000 టన్నుల బంగారాన్ని త‌వ్విన‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి.
25
ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధర‌లు

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో మాత్రం బంగారం ధ‌ర అధికంగా ఉంది. ఇక్క‌డ ఆదివారం 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 100,080 వ‌ద్ద కొనసాగుతోంది. కాగా 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 91,750గా ఉంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,330గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 91,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 99,330కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* ఇక బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఇక్క‌డ ఆదివారం ఉద‌యం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

35
తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.

* హైద‌రాబాద్‌లోనూ బంగారం ధ‌ర రూ. ల‌క్ష కిందికి దిగొచ్చింది. ఇక్క‌డ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 99,330కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 91,600గా ఉంది.

* విశాఖ‌ప‌ట్నం విష‌యానికొస్తే ఇక్క‌డ కూడా 24 క్యారెట్ల బంగారం రూ. 99,330కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 91,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

45
వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే

వెండి ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. ఆదివారం వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. అయితే కిలో వెండి ధ‌ర మాత్రం రూ. 1,16,000 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. 1,16,000గా ఉండ‌గా, హైద‌రాబాద్‌, కేర‌ళ‌, చెన్నైలో మాత్రం అత్య‌ధికంగా రూ. 1,26,000 వ‌ద్ద కొన‌సాగుతోంది

55
బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి.?

బంగారం ధ‌ర‌లు త‌గ్గడానికి చాలా కార‌ణాలు చెబుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు యుద్ధాల కార‌ణంగా బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ ప‌రిణామాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కొంత‌మేర ఇన్వెస్ట‌ర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మొగ్గు చూపుతున్నారు. ఈ కార‌ణంగానే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ‌ని అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో వివాహాలు, సుముర్తాలు ఉండ‌డంతో బంగారం ధ‌ర మ‌ళ్లీ పెర‌గ‌డం ఖాయ‌న‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories