ఫ్లిప్‌కార్ట్ ఈ డిస్కౌంట్‌ను బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లతో అందిస్తోంది. ప్రస్తుతం 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. అయితే, ICICI లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ.10,000 తక్కువగా పొందవచ్చు.
అలాగే, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. మీరు మార్చే ఫోన్ మోడల్, దాని పని స్థితిని బట్టి, ఎక్స్‌చేంజ్ ధర రూ. 69,500 వరకు ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు నథింగ్ ఫోన్ 2ఏ మోడల్‌ను పర్‌ఫెక్ట్ కండిషన్‌లో ఎక్స్‌చేంజ్ చేస్తే మొత్తం రూ.19,100 తగ్గింపు పొందవచ్చు. ఇలా చేస్తే నథింగ్ ఫోన్ 3 5జీ ఫైనల్ ధర కేవలం రూ. 49,900 మాత్రమే. ఈ ధరకు ఇది బెస్ట్ డీల్ అవుతుంది.