Gold Price: బంగారం కొనేవారు కొన్ని రోజులు ఆగండి.. త్వరోలోనే రూ. 15వేలు తగ్గే అవకాశం.?

Published : Mar 22, 2025, 09:54 AM IST

బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 90 వేలు దాటేసింది. దీంతో పసిడి పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..   

PREV
14
Gold Price: బంగారం కొనేవారు కొన్ని రోజులు ఆగండి.. త్వరోలోనే రూ. 15వేలు తగ్గే అవకాశం.?
gold price

బంగారాన్ని, భారతీయులను విడదీసి చూడలేమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో బంగారం ఉంటే అదో ధీమా అని భావించే వారు చాలా మంది ఉంటారు. అందుకే ఆఫీసులో బోనస్‌ వచ్చినా, మరే రూపంలో డబ్బులు అందినా కొంత బంగారం కొని పెట్టేద్దామని చాలా మంది భావిస్తుంటారు.

అందుకే బంగారానికి ఇంత డిమాండ్‌ ఉంటుందని చెప్పాలి. కాగా తాజాగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర రూ. 90 వేలు దాటేసింది. అయితే రూ. లక్షకు చేరుకోవడం ఖాయమని వార్తలు వచ్చిన తరుణంలో తాజాగా బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. 

24

ప్రస్తుతం ఔన్సు గోల్డ్‌ (31.10) గ్రాముల బంగారం ధర 3023 డాలర్లుగా ఉంది. గత రెండు రోజుల క్రితం ఈ ధర ఏకంగా 3050 డాలర్లుగా ఉంది. అయితే డాలర్‌తో పోల్చితే రూపాయి పెరుగుతుండంతో బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా రూ. 400 మేర తగ్గుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ 10 గ్రాముల బంగారం ధర రూ. 90 వేల దిగువ మార్కుకు చేరుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,210 వద్ద కొనసాగుతోంది. 

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 82,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,210 వద్ద కొనసాగుతోంది. విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 
 

34

రూ. 15 వేలు తగ్గనున్న బంగారం ధర: 

ఇదిలా ఉంటే ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు త్వరలోనే భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు స్థిరంగా ఉంచడంతోపాటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం శాంతించడం వంటి అంశాలు బంగారం ధరలు తగ్గేందుకు దోహదపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సిటీ బ్యాంక్‌ అంచనా ప్రకారం 2025 చివరి నాటికి బంగారం ధర 3500 డాలర్లు ఒక ఔన్స్ అయ్యే అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. 
 

44

ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం కాస్త తగ్గుముఖం పడుతుండడం. ట్రంప్‌ ఈ దిశగా అడుగులు వేస్తుండడ కూడా ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. స్టాక్‌ మార్కెట్లు పతనం కావడంతో బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరిగాయి. అయితే తాజాగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరుగుతుండడం, యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటున్నాయి.

బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండడం దీనికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ అంచనా ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 2800 డాలర్లకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే బంగారం ధర రూ. 16 వేలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories