CEAT Tires: సియట్ టైర్లు వేరే లెవల్ అంతే.. 300 కి.మీ. వేగంతో వెళ్లినా ఏం కాదు. ధర కూడా తక్కువే

Published : Mar 22, 2025, 06:00 AM IST

CEAT Tires: ప్రపంచ దిగ్గజ టైర్ల తయారీ సంస్థ సియట్ కొత్త రకం టైర్లను తీసుకొస్తోంది. ఇవి ఎంత స్పెషల్ అంటే.. 300 కి.మీ. వేగంతో దూసుకుపోయినా టైర్లకు ఏమీ కాదు. కారు టైర్ల నుంచి శబ్దం కూడా రాదు. మరి ఈ టైర్లు మార్కెట్ లోకి ఎప్పుడొస్తాయో తెలుసుకుందాం రండి. 

PREV
15
CEAT Tires: సియట్ టైర్లు వేరే లెవల్ అంతే.. 300 కి.మీ. వేగంతో వెళ్లినా ఏం కాదు. ధర కూడా తక్కువే

కారులో 100, 120 స్పీడ్ తో వెళ్తేనే టైర్ల నుంచి భారీగా శబ్దం వస్తుంది కదా.. కాని సియట్ కంపెనీ తయారు చేస్తున్న ఈ కొత్తరకం టైర్లు 300 కి.మీ. వేగంతో దూసుకుపోయినా అస్సలు శబ్దం చేయవు.  పైగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. భారత్‌లో తొలిసారిగా తమ స్పోర్ట్‌డ్రైవ్ శ్రేణిలో గ్లోబల్ టెక్నాలజీస్‌ను ఆవిష్కరిస్తూ సియట్ ఈ టైర్లను తీసుకొస్తోంది. 
 

25

ఈ టైర్లు అల్ట్రా-లగ్జరీ, హై-పెర్ఫార్మెన్స్ కార్లు, ఎస్‌యూవీలకు అనుగుణంగా తయారవుతున్నాయి. 300 కి.మీ.కి మించిన వేగాన్ని కూడా తట్టుకునేలా ZR-రేటెడ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. రోడ్డుపై వెళుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గించి, డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపర్చేలా CALM టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. 

35

పంక్చర్ అయిన తర్వాత కూడా మినిమం స్పీడ్ తో వాహనం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ టైర్ల వల్ల హై-ఎండ్ సెడాన్లు, ఎస్‌యూవీలకు అదనపు భద్రత లభిస్తుంది. 

ఈ టైర్లు 21 అంగుళాల మందం ఉంటాయి. ZR రేటెడ్ టైర్లను తయారు చేసే తొలి భారతీయ టైర్ల తయారీ సంస్థగా సియట్ నిలిచింది. 

45

ఈ టైర్లు జర్మనీలోని అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్లాంట్లలో కఠినతరమైన పరీక్షలన్నింటిలో బెస్ట్ గా నిలిచాయి. పనితీరు, భద్రత రీత్యా అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉన్నాయని గుర్తింపు పొందాయి.

ఈ టైర్ల వల్ల లగ్జరీ, హై పెర్ఫార్మెన్స్ వాహనాలకు మెరుగైన భద్రత లభిస్తుంది. ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. కారు నడిపే వారికి, కూర్చున్న వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. 

55

సియట్ నుంచి ఈ అద్భుతమైన టైర్లు ఏప్రిల్ నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, పుణె, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, బెంగళూరు, తమిళనాడు, కోయంబత్తూరు, మదురై, కేరళ, హైదరాబాద్, గువాహటి, అహ్మదాబాద్‌లాంటి కీలక మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. 

రన్‌-ఫ్లాట్ టైర్ల ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 దాకా ఉంటుంది. అలాగే 21 అంగుళాల ZR రేటెడ్ అల్ట్రా-హై-పెర్ఫార్మెన్స్ CALM టెక్నాలజీ టైర్ల ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories