Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు

Published : Jul 27, 2026, 11:52 AM IST

Gold Price Hike: కొన్ని నెలలుగా బంగారం, వెండి మార్కెట్‌లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఒకరోజు భారీగా పెరగడం, మరోరోజు ఒక్కసారిగా పడిపోవడం.. ఇలా పెట్టుబడిదారులను, కొనుగోలుదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

PREV
13
మార్కెట్ల జోరు

ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఈ పెరుగుదల మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొన్ని వారాలుగా ప్రపంచ మార్కెట్లను కుదిపేసిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు దేశాలు ప్రత్యక్ష దాడులను నిలిపివేయడం, ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు ప్రారంభమవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది.

23
తగ్గుతున్న చమురు ధరలు

ఈ పరిణామాల ప్రభావంతో ముడి చమురు ధరలు కూడా ఒక్కసారిగా తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ రెండూ ఇటీవల నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి దిగివచ్చాయి. చమురు మార్కెట్‌లో ఒత్తిడి తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారం వంటి విలువైన లోహాలపై దృష్టిపెడుతున్నారు. 

ఇక మధ్యప్రాచ్య ప్రాంతంలోని సముద్ర రవాణా మార్గాలు కూడా గతంలో సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా కమోడిటీ మార్కెట్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడటంతో మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.

33
తాజా బంగారం, వెండి ధరలు

ఇప్పుడు ఈరోజు దేశీయ మార్కెట్‌లో నమోదైన బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,45,860కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.850 పెరిగి రూ.1,33,700 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.690 పెరిగి రూ.1,09,390గా నమోదైంది. వెండి ప్రస్తుతం స్థిరంగా ఉంది. కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories