Post office: నెల‌కు రూ. 12 వేలు ప‌క్క‌న పెడితే రూ. 43 ల‌క్ష‌లు జ‌మ చేయొచ్చు.. జ‌స్ట్ 15 ఏళ్ల‌లోనే

Published : Jul 26, 2026, 07:56 PM IST

Post office: భవిష్యత్తు కోసం సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మంచి ఎంపికగా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులు లేకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో ఏకంగా రూ. 43 ల‌క్ష‌లు ఫండ్ త‌యారు చేయొచ్చు

PREV
14
రోజుకు రూ.411 పొదుపు చేస్తే..

PPF ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంటే రోజుకు సుమారు రూ.411 చొప్పున పొదుపు చేస్తే నెలకు దాదాపు రూ.12,500, ఏడాదికి రూ.1.5 లక్షలు అవుతుంది. ఇలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రూ.1.5 లక్షలు చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.9 శాతం వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయానికి మొత్తం నిధి సుమారు రూ.43.60 లక్షలకు చేరుకోవచ్చు. ఇందులో దాదాపు రూ.21 లక్షలు వడ్డీ రూపంలోనే లభిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా వడ్డీ రేట్లను సమీక్షిస్తూ మార్పులు చేస్తుంటుంది. అందువల్ల చివరికి వచ్చే మొత్తం అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి మారవచ్చు.

24
PPF స్కీమ్ ప్రత్యేకతలు ఏమిటి?

PPF పథకాన్ని దీర్ఘకాలిక పొదుపు కోసం రూపొందించారు. ఇందులో కనిష్ఠంగా రూ.500తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ఠంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఒకేసారి మొత్తం డబ్బు జమ చేయొచ్చు లేదా ఏడాది పొడవునా విడతల వారీగా కూడా చెల్లించవచ్చు. కాంపౌండ్ వడ్డీ ప్రయోజనం ఉండటంతో కాలం గడిచే కొద్దీ పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. అందుకే పిల్లల ఉన్నత చదువులు, వివాహం, పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చాలామంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.

34
పన్ను మినహాయింపు, ప్రభుత్వ భరోసా కూడా

PPF పథకంలో పెట్టుబడి పెట్టే వారికి పన్ను పరంగా కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ పథకంలో వచ్చే వడ్డీపై కూడా పన్ను ఉండదు. మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తంపైనా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా PPFను EEE (Exempt-Exempt-Exempt) కేటగిరీలోకి తీసుకొస్తారు. అలాగే ఇది కేంద్ర ప్రభుత్వం మద్ధతుతో నడిచే పథకం కావడంతో పెట్టుబడిపై భద్రత విషయంలో పెట్టుబడిదారులు నమ్మకంగా ఉండొచ్చు.

44
అత్యవసర సమయంలో రుణం.. ఇంట్లో నుంచే ఖాతా నిర్వహణ

PPF ఖాతాలో డబ్బు జమ చేసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఖాతా ప్రారంభించిన మూడో సంవత్సరం నుంచి ఆరవ సంవత్సరం మధ్య ఖాతాలో ఉన్న మొత్తంపై నిబంధనల ప్రకారం రుణం పొందవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం పోస్టాఫీస్ సేవలు డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), DakPay యాప్‌ల ద్వారా ఇంట్లో నుంచే PPF ఖాతాను నిర్వహించవచ్చు. బ్యాంక్ ఖాతాను IPPBతో అనుసంధానం చేసిన తర్వాత మొబైల్ ద్వారానే డబ్బు జమ చేయడం, లావాదేవీలు నిర్వహించడం సులభంగా చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories