Gold Rate Today: ఇవాళ వెండి భారీ షాక్ ఇచ్చింది. మరింత పతనమైంది. బంగారం ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటి, హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కొంత తగ్గింది. దీంతో గత వారం రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు ప్రస్తుతం కాస్త స్థిరపడినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ సామాన్యులకు షాక్ ఇచ్చిన పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుదల నమోదు చేయగా, నేడు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగుతున్నాయి.
24
కొనుగోలుదారులకు ఊరట
బంగారం ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు చేయాలనుకున్నవారు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేసే వారికి ధరల మార్పులు కీలకంగా మారాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండటం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.
34
కిలో వెండిపై రూ.5వేలు తగ్గుదల
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,100 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,500గా ఉంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,13,320గా నమోదైంది. గత రోజు ధరలతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. కిలో వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2.70లక్షలకు చేరుకుంది.
అంతర్జాతీయ పరిస్థితులు మరింత ప్రశాంతంగా కొనసాగితే బంగారం ధరల్లో పెద్ద ఎత్తున పెరుగుదల ఉండకపోవచ్చని చెబుతున్నారు. అయితే అమెరికా డాలర్, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అవకాశముంది.
ఇక పెట్టుబడిదారులు మాత్రం బంగారం ధరల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. భవిష్యత్తులో ధరలు మళ్లీ పెరుగుతాయా లేక మరింత తగ్గుతాయా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మాత్రం బంగారం మార్కెట్‌లో ప్రశాంత వాతావరణం కనిపిస్తుండగా, ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.