Gold Prices: బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులతో మార్కెట్‌లో ఒత్తిడి కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరపడుతున్నాయి. బంగారంపై డిమాండ్ తగ్గి స్వల్పంగా క్షీణించాయి.
ఇటీవలి కాలంలో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనాలనుకునే వారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
24
బంగారం మార్కెట్ లో తగ్గిన ఒత్తిడి
ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి చేరుతున్నాయనే సంకేతాలు కనిపించడంతో బంగారం మార్కెట్‌లో ఒత్తిడి తగ్గింది.
34
క్రమంగా దిగొస్తున్న గోల్డ్
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో గత వారం రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం పెరుగుతుందనే అంచనాలు, మరోవైపు డాలర్ పుంజుకోవడం బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా డాలర్ బలపడితే బంగారంపై పెట్టుబడులు కొంత తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు కూడా క్రమంగా దిగివస్తుంటాయి.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విభిన్న రంగాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ పరిణామం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతోంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఇప్పటికీ విశ్వసనీయ పెట్టుబడిగానే ఉందని వారు చెబుతున్నారు. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.1,51,100 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.1,38,500గా నమోదైంది. ఇక 18 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.1,13,320 వద్ద ట్రేడ్ అవుతోంది.