Recharge Plan: రోజుకు 1.5 జీబీ డేటా 84 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్

Published : Jun 17, 2026, 06:50 AM IST

Recharge Plan: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థలలో ఒకటైన జియో తన వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. తరచూ రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. 

PREV
15
రూ.889 ప్లాన్‌

జియో అందిస్తున్న రూ.889 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే దాదాపు మూడు నెలల పాటు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.

25
అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ ఉచిత SMSలు

ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఎక్కువగా కాల్స్ చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

35
84 రోజులకు మొత్తం 126GB డేటా

డేటా ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా అందుతుంది. 84 రోజుల కాలానికి మొత్తం 126GB డేటా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ క్లాసులు, వెబ్ బ్రౌజింగ్ వంటి అవసరాలకు ఈ డేటా సరిపోతుంది.

45
అదనపు డిజిటల్ ప్రయోజనాలు కూడా

ఈ ప్లాన్‌తో పాటు జియో కొన్ని ప్రత్యేక డిజిటల్ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులు జియో టీవీ ద్వారా వివిధ టీవీ ఛానెల్‌లను వీక్షించవచ్చు. అలాగే జియో సావ‌న్ ప్రో సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం కూడా లభిస్తుంది. కొంత‌మంది యూజ‌ర్ల‌కు గూగుల్ జెమినీ సంబంధిత ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉండొచ్చు.

55
ఎవరికి ఈ ప్లాన్ బెస్ట్?

తరచూ రీఛార్జ్ చేయకుండా ఎక్కువ రోజులు సేవలు ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ అనువైనది. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMSలు, అదనపు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు ఒకే ప్లాన్‌లో కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. మూడు నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకుంటే రూ.889 జియో ప్లాన్‌ను పరిశీలించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories