Gold Price: మ‌ళ్లీ పెరిగే లోపే కొనేయండి.. ఒక్క రోజులో భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

Published : Jul 24, 2025, 02:33 PM IST

బంగారం ధరలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం గోల్డ్ ధర ఎలా ఉందంటే. 

PREV
15
ఒక్క రోజులోనే రూ. 1300కి పైగా డౌన్

బుధవారం బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. ఒక్క రోజులోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1360 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధరంపై రూ. 1250 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100970కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,550 వద్ద కొనసాగుతోంది.

25
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 101220కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,700 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 100970గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100970గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,550గా ఉంది.

* బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఇక్క‌డ 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ.100970కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

35
తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.?

* హైద‌రాబాద్ విష‌యానికొస్తే బుధ‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100,970కాగా 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100,970కాగా 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,550 వ‌ద్ద కొన‌సాగుతోంది

* ఇక విజ‌య‌వాడ విష‌యానికొస్తే ఇక్క‌డ 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 100,970కాగా 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 92,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

45
వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా త‌గ్గాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కిలో వెండిపై రూ. 1000 త‌గ్గింది. ప్ర‌స్తుతం ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబై వంటి న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. 1,18,000 వ‌ద్ద కొన‌సాగుతోంది. కాగా హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌, పుణె, చెన్నై వంటి న‌గ‌రాల్లో అత్య‌ధికంగా కిలో వెండి ధ‌ర రూ. 1,28,000 వ‌ద్ద కొన‌సాగుతోంది.

55
బంగారం ధ‌ర ఎందుకు త‌గ్గింది.?

ఇదిలా ఉంటే బంగారం ధ‌ర త‌గ్గ‌డానికి డాల‌ర్ ప‌త‌నం కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం డాల‌ర్ రెండు వారాల క‌నిష్ట స్థాయిలో ఉంది. దీంతో బంగారంపై పెట్టుబ‌డి పెట్టే వారి సంఖ్య త‌గ్గింది. అలాగే జపాన్ తో అమెరికా వాణిజ్య ఒప్పందం విజయవంతం అవ్వడంతో స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగింది. ఈ కార‌ణంగానే బంగారం ధర పతనమ‌వుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories