గత కొన్ని రోజులుగా ఆగకుండా పరుగులు తీసిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో రూ.1,42,050 వద్ద నమోదైంది. విజయవాడలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,970, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,050, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,920గా నమోదైంది. అయితే బంగారం ధరలు తగ్గాయన్న కారణంతో వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం కంటే.. మీ నగరంలోని రిటైల్ మార్కెట్ ధరలు, నగలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది.