Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు

Published : Aug 18, 2026, 12:22 PM IST

Gold: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది నగల రూపంలో కొనుక్కుంటారు. నిజానికి తరుగు, మజూరీ వంటి అదనపు ఖర్చులు లేకుండా బంగారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో వివరంగా తెలుసుకోండి.

PREV
13
బంగారాన్ని నగల రూపంలో కొనాలా వద్దా?

భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఇది పెట్టుబడిగా మారిపోయింది. సంప్రదాయం, భద్రత. పెళ్లిళ్లు, పిల్లల భవిష్యత్తు, పండగల కోసం బంగారు నగలు కొనడం మనకు అలవాటు. కానీ, పెట్టుబడి కోసమే బంగారం కొంటుంటే ఆ బంగారాన్ని నగల రూపంలో కొనవచ్చా? మరి ఇంకెలా కొనాలి? ఇక్కడ తెలుసుకోండి.

బంగారాన్ని నగల రూపంలో కొన్నప్పుడు కేవలం బంగారం విలువ మాత్రమే కాదు. దానిలో తరుగు, మజూరీ, డిజైన్ ఛార్జీలు, పన్నులు.. ఇలా చాలా ఖర్చులు కలిసి ఉంటాయి. నగల డిజైన్, కొనే షాపును బట్టి ఈ అదనపు ఖర్చులు భారీగా మారుతాయి. ఉదాహరణకు మీరు కొంత మొత్తానికి బంగారం కొన్నా, మీరు చెల్లించిన పూర్తి మొత్తం బంగారం విలువగా మారదు. తర్వాత ఆ నగలను అమ్మేటప్పుడు, మీరు అప్పుడు చెల్లించిన మజూరీ, ఇతర ఛార్జీలు పూర్తిగా వెనక్కి రాకపోవచ్చు. అందుకే, పెట్టుబడి కోసం కొనే బంగారానికి నగల రూపం అదనపు ఖర్చును తెచ్చిపెడుతుంది.

23
24 క్యారెట్ల బంగారంగా కొనండి

పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేలు లేదా బిస్కెట్లను కొనడం మంచిది. ముఖ్యంగా నమ్మకమైన అమ్మకందారుల నుంచి నాణ్యతా ధృవీకరణ పత్రంతో (purity certificate) కొనడం చాలా ముఖ్యం. నగల మాదిరిగా డిజైన్ ఖర్చులు ఎక్కువగా ఉండవు కాబట్టి, బంగారం అసలు విలువపై పెట్టుబడి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. అయితే, కొనే ధర, అమ్మే ధరకు మధ్య ఉండే తేడాను ముందుగానే గమనించాలి.

33
Gold ETF, గోల్డ్ బాండ్ రూపంలో
బంగారాన్ని ఇంట్లో పెట్టుకునే రిస్క్ వద్దనుకునే వారికి గోల్డ్ ఆధారిత ఆర్థిక పెట్టుబడి మార్గాలు కూడా ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) వంటి పెట్టుబడులు బంగారం ధర కదలికలతో ముడిపడి ఉంటాయి. అలాగే, ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకం కూడా మంచి ఆప్షన్. ఇది బంగారం ధర పెరుగుదలతో పాటు, వడ్డీ ఆదాయాన్ని కూడా అందిస్తుంది. అయితే, కొత్త జారీలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారవచ్చు కాబట్టి, పెట్టుబడికి ముందు ప్రస్తుత రూల్స్ చెక్ చేసుకోవడం ముఖ్యం.
Read more Photos on
click me!

Recommended Stories