Gold Price: బంగారం కొంటున్న వారికి ఇక ఇత్తడే.. కుప్పకూలనున్న గోల్డ్ ధరలు

Published : Jan 29, 2026, 01:27 PM IST

Gold Price: బంగారం ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా గోల్డ్ ప్రైజ్‌లు దూసుకెళ్తున్నాయి. అయితే పెరుగుట విరుగుట‌కే అన్న‌ది బంగారానికి వ‌ర్తించ‌బోతోంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

PREV
15
డిమాండ్ తగ్గినా ధరలు పెరుగుతుండటానికి కారణమేంటి..?

సాధారణంగా ఏ వస్తువైనా కొనేవాళ్లు తగ్గితే ధర కిందికి రావాలి. కానీ బంగారం విషయంలో ఆ లాజిక్ పనిచేయడం లేదు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నా రిటైల్ మార్కెట్లో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. అయినా రేట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఇదే అసలు భయానికి కారణం. ప్రజల నుంచి డిమాండ్ లేకపోయినా ధర పెరగడం అంటే మార్కెట్లో సహజ ప్రక్రియ కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

25
2025లో 60 శాతం పెరుగుదల… ఇది బబుల్ సంకేతమా..?

2025లోనే బంగారం ధర దాదాపు 60 శాతం ఎగబాకింది. ఇది సాధారణ పెరుగుదల కాదు. మార్కెట్ నిపుణులు దీన్ని ‘బబుల్’గా అభివర్ణిస్తున్నారు. అంటే సహజ విలువ కన్నా చాలా ఎక్కువ స్థాయికి ధర చేరిందన్న మాట. ఇలాంటి బబుల్ ఎక్కువ కాలం నిలబడదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఒక్కసారిగా పేలితే నష్టాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ దశలో గరిష్ట ధరలకు కొనుగోలు చేయడం ప్రమాదకరమనే హెచ్చరికలు పెరుగుతున్నాయి.

35
విదేశీ రిపోర్టులు… సామాన్యులే టార్గెట్..?

బంగారం ధర గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెద్ద విదేశీ బ్యాంకులు “ఇంకా పెరుగుతుంది” అంటూ పాజిటివ్ రిపోర్టులు విడుదల చేస్తాయన్న విమర్శలు ఉన్నాయి. గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ లాంటి సంస్థల అంచనాలు చూసి సామాన్యులు కొనుగోళ్లకు పరుగులు పెడతారు. అదే సమయంలో పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని నెమ్మదిగా విక్రయించి లాభాలు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ధరలు పడిపోయినప్పుడు నష్టాల్లో మిగిలేది సాధారణ ప్రజలే.

45
ధరల మాయాజాలం… గతంలో బయటపడిన నిజాలు

బంగారం ధర లండన్, న్యూయార్క్ కేంద్రంగా కొన్ని పెద్ద బ్యాంకుల చేతుల్లోనే ఉంటుందన్న ఆరోపణలు కొత్తవి కావు. గతంలో జేపీ మోర్గాన్ బ్యాంక్ “స్పూఫింగ్” అనే అక్రమ పద్ధతితో గోల్డ్ రేట్లను కృత్రిమంగా పెంచిన విషయం బయటపడింది. భారీగా ఫేక్ ఆర్డర్లు పెట్టి ధర పెరిగిన తర్వాత వాటిని రద్దు చేయడమే ఈ ట్రిక్. ఈ నేరానికి ఆ బ్యాంక్ భారీ జరిమానా కూడా చెల్లించింది. దీన్ని బట్టి ధరల మ్యానిపులేష‌న్‌ జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

55
గత చరిత్ర చెబుతున్న హెచ్చరికలు

ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా చూశాం. 1980లో బంగారం ధర పీక్స్‌కు వెళ్లి తర్వాత 57 శాతం కుప్పకూలింది. మళ్లీ అదే స్థాయికి రావడానికి 25 ఏళ్లు పట్టింది. 2011లో కూడా భారీ ర్యాలీ తర్వాత 45 శాతం పతనం జరిగింది. కోలుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఇప్పుడు 2026లో కూడా అదే తరహా దిద్దుబాటు వచ్చే అవకాశముందని అనలిస్టులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లు నగదు అవసరంతో గోల్డ్, సిల్వర్ ETFలను అమ్మడం ప్రారంభిస్తారు. దాంతో బంగారం ధర ఒక్కసారిగా కిందికి వచ్చే ప్రమాదం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories