Gold: అస‌లు బంగారం ఎలా పుట్టింది.? ఎందుకంతా విలువైందిగా మారింది.?

Published : Jan 25, 2026, 08:21 AM IST

Gold: బంగారాన్ని భారతీయుల‌ను విడ‌దీసి చూడ‌లేం. గోల్డ్ కేవ‌లం ఇన్వెస్ట్‌మెంట్ లాగానే కాకుండా ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యే వారు చాలా మంది ఉంటారు. అయితే ఇలాంటి బంగారం అస‌లు ఎలా పుట్టింది.? ఇంత విలువైందిగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
బంగారం పుట్టుక ఎక్కడ జరిగింది?

బంగారం భూమిపై పుట్టిన లోహం కాదు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం, బంగారం పుట్టుక అంతరిక్షంలో జరిగింది. భూమి ఏర్పడకముందే, న్యూట్రాన్ తారల ఢీకొన్న సందర్భాలు, సూపర్‌నోవా పేలుళ్ల సమయంలో బంగారం వంటి భారమైన లోహాలు తయారయ్యాయి. ఆ సమయంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి వల్లే బంగారం జన్మించింది. సాధారణ నక్షత్రాలు బంగారం తయారు చేయలేవు.

25
బంగారం భూమికి ఎలా వచ్చింది?

సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి కరిగిన స్థితిలో ఉన్న సమయంలో అంతరిక్షం నుంచి అనేక ఉల్కాపాతాలు జరిగాయి. ఆ ఉల్కలు బంగారం వంటి భారమైన లోహాలను తీసుకొచ్చాయి. మొదట బంగారం బరువు కారణంగా భూమి లోపలి భాగానికి చేరింది. కాలక్రమంలో అగ్నిపర్వతాల చర్యలు, భూగర్భ మార్పుల వల్ల కొంత బంగారం భూమి పై పొరలోకి వచ్చింది. ఈ కారణంగా నేడు మనకు గనుల్లో బంగారం లభిస్తోంది.

35
ప్రాచీన నాగరికతల్లో బంగారం ప్రాముఖ్యత

క్రీ.పూ. 3000 ప్రాంతంలో ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు బంగారాన్ని దేవతల శరీరంగా భావించారు. బంగారం మెరుపు, అరుదైన స్వభావం కారణంగా దైవత్వానికి ప్రతీకగా చూశారు. రాజుల కిరీటాలు, దేవాలయాలు, సమాధులపై బంగారంతో అలంకరణ చేసేవారు. అప్పుడు నుంచే బంగారం శక్తి, సంపదకు గుర్తుగా మారింది.

45
బంగారం ఎందుకు అంత విలువైంది?

బంగారం చాలా అరుదైన లోహం. ఇప్పటి వరకూ మానవులు తవ్విన మొత్తం బంగారం రెండు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో సరిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. మరో ముఖ్యమైన కారణం దీని నాశనం కాని స్వభావం. వేల సంవత్సరాలు గడిచినా బంగారం తుప్పు పట్టదు, రంగు మారదు. చాలా సులభంగా ఆకారం ఇవ్వవచ్చు. ఈ లక్షణాలే బంగారాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

55
కరెన్సీ నుంచి పెట్టుబడి వరకు బంగారం ప్రయాణం

క్రీ.పూ. 700 ప్రాంతంలో లిడియా రాజ్యం మొదటిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టింది. ఒకే విలువ, దీర్ఘకాలిక మన్నిక, సులభంగా గుర్తించగలిగే స్వభావం కారణంగా వ్యాపారానికి బంగారం అనుకూలంగా మారింది. కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా విలువకు ఒక సాధారణ ప్రమాణంగా మారింది. నేటికీ సెంట్రల్ బ్యాంకులు, పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గే పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories