Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం

Published : Jun 08, 2026, 11:44 AM IST

Today Gold Rate: బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూసేవారికి బిగ్ అప్ డేట్. ఇవాళ కూడా పసిడి ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి ఇది కొనడానికి సరైన సమయమా అంటే...నిపుణులు ఏం చెప్తున్నారంటే... 

PREV
14
పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకునేవారికి ఇదొక ఊహించని పరిణామం. బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు కొనచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతలా గోల్డ్ రేట్లు పతనమైయ్యాయి. మొత్తం ఈ 10 రోజుల్లో రూ.7 వేల రూపాయలు తగ్గింది. అందుకే బంగారం మార్కెట్లో కొనుగోల్లు కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. 

24
తగ్గుముఖం పడుతున్న గోల్డ్

కొన్నిరోజుల క్రితం రికార్డు స్థాయులను చేరిన బంగారం ధరలు మళ్లీ వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రమంగా రేట్లు క్షీణించడంతో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు.

34
రూ.1,51,690 చేరిన పసిడి

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,040 తగ్గి ధర రూ.1,51,690 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.950 మేర తగ్గి ధర రూ.1,39,050గా నమోదైంది. వెండి ధర కూడా స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.70 లక్షల వద్ద కొనసాగుతోంది.

44
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు

బంగారం ధరలంటే..అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారుల వ్యూహాలు, డాలర్ వంటి అంశాలు పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ధరలు తగ్గుతున్నప్పటికీ, బంగారం మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. అందుకే కొనుగోలు చేయాలనుకునేవారు రోజువారీ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories