Gold Price: కాస్త దిగొచ్చిన ధరలు.. ఈ ఊరట తాత్కాలికమేనా?

Published : Mar 03, 2026, 10:05 AM IST

Gold Price: అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న, ఇవాళ చూసుకుంటే స్వల్ప ఊరట కనిపిస్తోంది. తగ్గుదల తాత్కాలికమా లేదా మరింత మార్పుకు సంకేతమా అన్నది చూడాల్సి ఉంది.

PREV
14
బంగారం, వెండిపై యుద్ధం ఎఫెక్ట్

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం మళ్లీ బంగారం, వెండి మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన అస్థిరత కారణంగా గత రెండు రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కొనుగోలుదారులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా భావించవచ్చు. సాధారణంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తారు. దీంతో పెట్టుబడులు పెరిగి ధరలు ఎగసిపడుతుంటాయి. అయితే మార్చి 3న పరిస్థితి కొంత మారింది. బంగారంపై కాస్త ధరలు దిగొచ్చాయి.

24
కొనుగోలుదారులకు కాస్త ఊరట

హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర కిందటి రోజుతో పోలిస్తే రూ. 450 తగ్గి రూ. 1,55,850 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 490 తగ్గి రూ. 1,70,020కు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, దీనికి ముందు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,000 , రూ. 6,550 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా అదే విధంగా గణనీయంగా ఎగిసింది.

34
వెండిపై రూ.10,000వేలు తగ్గింపు

వెండి ధరల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. కేజీ వెండి ధర రూ. 10,000 తగ్గి ప్రస్తుతం రూ. 3.15 లక్షల వద్ద ఉంది. అంతకు ముందు వెండి ధర వరుసగా రూ. 5,000, రూ. 25,000 మేర పెరిగింది.

44
ఈ తగ్గుదల తాత్కాలికమా?, లేక సర్దుబాటుకు సంకేతమా?

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో ఔన్సుకు 5,400 డాలర్లను దాటగా, ఇప్పుడు అది 5,330 డాలర్లకు తగ్గింది. సిల్వర్ ధర కూడా 95 డాలర్ల స్థాయి నుంచి 88 డాలర్లకు పడిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ అనిశ్చితి వంటి అంశాలు ఈ మార్పులకు కారణమయ్యాయి.

మొత్తం మీద చూస్తే, గత రెండు రోజుల భారీ పెరుగుదల తర్వాత వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమా, లేక మరింత సర్దుబాటుకు సంకేతమా అన్నది చూడాల్సి ఉంది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ ధోరణిని గమనించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories