CIBIL Score: క్రెడిట్ స్కోర్ సూపర్ ఉన్నా లోన్ రావట్లేదా.! తప్పు ఎక్కడ జరిగిందంటే.?

Published : Mar 02, 2026, 08:04 PM IST

CIBIL Score: చాలామంది తమ క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే లోన్ కచ్చితంగా వస్తుందని భావిస్తారు. కానీ, మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేయడానికి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం.. 

PREV
15
క్రెడిట్ స్కోరు బాగుండాలని..

సాధారణంగా లోన్ కావాలంటే క్రెడిట్ స్కోరు బాగుండాలని అందరూ అనుకుంటారు. 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకులు వెంటనే లోన్ ఇస్తాయని చాలామంది భావిస్తారు. అయితే, కేవలం క్రెడిట్ స్కోరు బాగున్నంత మాత్రాన లోన్ మంజూరు అవుతుందని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు మంచి స్కోరు ఉన్న వ్యక్తులను కూడా బ్యాంకులు రిజెక్ట్ చేస్తాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలను ఇలా ఉన్నాయి.

25
ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం

క్రెడిట్ స్కోరు అనేది మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎంత క్రమశిక్షణతో చెల్లించారో మాత్రమే చెబుతుంది. కానీ, భవిష్యత్తులో లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందా లేదా అని బ్యాంకులు మీ ప్రస్తుత ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తాయి. మీ ఆదాయం స్థిరంగా లేకపోయినా లేదా మీరు తరచుగా ఉద్యోగాలు మారుస్తున్నా బ్యాంకులు లోన్ ఇవ్వడానికి వెనకాడుతాయి.

35
అప్పుల భారం

మీకు మంచి స్కోరు ఉన్నప్పటికీ, ఇప్పటికే మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు ఎక్కువగా ఉంటే కొత్త లోన్ రావడం కష్టమవుతుంది. మీ నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులకే వెళ్తుంటే, కొత్తగా ఇచ్చే లోన్ భారాన్ని మీరు మోయలేరని బ్యాంకులు భావిస్తాయి. దీనినే 'డెట్-టు-ఇన్‌కమ్ రేషియో' అంటారు.

45
తరచుగా దరఖాస్తు చేయడం

తక్కువ సమయంలో ఎక్కువ బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల్లో లోన్ కోసం దరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ రిపోర్టులో 'హార్డ్ ఎంక్వైరీ'లు నమోదవుతాయి. దీనివల్ల మీకు డబ్బు అవసరం ఎక్కువగా ఉందని లేదా మీ ఆర్థిక పరిస్థితి బాలేదని బ్యాంకులు అనుమానిస్తాయి. ఇది కూడా లోన్ రిజెక్షన్‌కు దారితీస్తుంది.

55
బ్యాంకు నిబంధనలు, డాక్యుమెంటేషన్

ప్రతి బ్యాంకుకు ఒక నిర్దిష్ట రిస్క్ పాలసీ ఉంటుంది. మీరు నివసించే ప్రాంతం లేదా మీరు చేసే ఉద్యోగ ప్రొఫైల్ వారి నిబంధనలకు అనుగుణంగా లేకపోతే లోన్ రాకపోవచ్చు. అలాగే, అసంపూర్తిగా ఉన్న పత్రాలు లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కూడా లోన్ రిజెక్ట్ అవుతుంది. గతంలో ఏదైనా అప్పు ఎగ్గొట్టిన చరిత్ర ఉన్నా (అది తర్వాత సెటిల్ చేసినా) బ్యాంకులు దానిని పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి, లోన్ కోసం ప్రయత్నించే ముందు కేవలం క్రెడిట్ స్కోరుపైనే కాకుండా, మీ ఆదాయ వనరులు, ఇప్పటికే ఉన్న అప్పుల భారంపై కూడా దృష్టి పెట్టడం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories