భారతీయ కుబేరుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన బిజీ షెడ్యూల్ ని కాస్త పక్కన పెట్టి మరీ పవిత్ర స్నానం కోసం ప్రయాగ్ రాజ్ వచ్చేశారు. కుంభమేళలో గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ దర్శనం చేసుకున్నారు. బడే హనుమాన్ ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.