కొంచెం సేపు ఫోన్ జేబులో ఉంటే దాన్ని మర్చిపోయామన్నట్టుగా వరుసగా వచ్చే నోటిఫికేషన్స్ మన ఫోన్ ఎక్కడుందో ఇట్టే చెప్పేస్తాయి. పొరపాటున ఒక్క నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే కనీసం గంట సేపు టైమ్ అంతా గడిచిపోతుంది. అలాంటిది కొంచెం సేపు ఫోన్ కనిపించకపోతే ఎవరైనా ఉండగలరా?
మీటింగ్ లో ఉండటం వల్లనో, దేవాలయాలకు వెళ్లిన సమయంలోనో ఫోన్ సైలెంట్ లో పెడుతుంటాం. కాని ఇంటికి వచ్చినా సైలెంట్ మోడ్ లోంచి తీయడం మర్చిపోయి ఎక్కడో పెట్టేస్తాం. తీరా దాని కోసం ఎంత వెతికినా ఒక్కోసారి అస్సలు కనిపించదు. ఇల్లంతా చిందరవందర చేసి వెతికినా ఒక్కోసారి కనిపించదు.