Fuel Saving Tips: రోజురోజూకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో చిన్న చిన్న మార్పులు చేస్తే పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చును చేయవచ్చు. మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళినా, రోజువారీ ప్రయాణం చేసినా ఈ చిట్కాలు పాటించండి. ఇంధన వ్యయాన్ని తగ్గించుకోండి.
గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు. ఇంధన ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల పెట్రోల్- డీజిల్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
27
స్పీడ్ డ్రైవింగ్ చేయకండి
మీ వాహనాన్ని వేగంగా నడపడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన పెట్రోల్ లేదా డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా, స్థిరమైన వేగంతో నడపండి. గంటకు 50-60 కి.మీ. వేగం సరైనది. స్థిరంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధనం ఆదా చేయవచ్చు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం ద్వారా సుమారు 33% వరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
37
రెగ్యులర్ సర్వీసింగ్
ఇంధనాన్ని ఆదా చేయడానికి మీ వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ వాహనం ఇంజిన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. సరైన వ్యవధిలో ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం వలన ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఇంధన ఖర్చులు తగ్గుతాయి .
ఇంధనాన్ని ఆదా చేయాలంటే.. ముందుగా సరైన ప్రణాళిక అవసరం. ఒకే ట్రిప్‌లో ఎక్కువ గమ్యస్థానాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే ప్రయాణ దూరం తగ్గి, ఇంధన వినియోగం తగ్గుతుంది. చిన్న దూరాల కోసం కారును ఉపయోగించకుండా, నడక లేదా సైకిల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అవసరంలేని ప్రయాణాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్‌ను ఉపయోగించడం మంచిది.
57
వాహనం టైర్లపై ఒత్తిడి
వాహనంలో సరైన టైర్ ప్రెజర్ ఉండటం వల్ల ఇంధనం ఆదా చేయవచ్చు. తక్కువ టైర్ ప్రెజర్ వలన ఇంధన వినియోగం పెరుగుతుంది. కనీసం నెలకు ఒకసారి టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేయడం మంచిది. అలాగే, వాహనంలో అనవసర వస్తువులను తీసివేయడం వలన వాహన బరువు తగ్గి ఇంధన ఖర్చులు తగ్గుతాయి.
67
ఇంధన ఎంపిక
సరైన ఇంధనం, ఇంధనం నింపే పద్ధతులు కూడా ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి. విశ్వసనీయ గ్యాస్ స్టేషన్లలో మాత్రమే ఇంధనం నింపండి. చౌకైన కానీ నాణ్యత లేని ఇంధనం మీ వాహనం పనితీరును తగ్గిస్తుంది. మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. రాత్రి వేళల్లో ఇంధనం నింపడం కంటే.. ఉదయం పూట ఇంధనం నింపడం ఉత్తమం. మొత్తం ట్యాంక్ నింపే బదులు, మీకు అవసరమైనంత ఇంధనం నింపుకోండి. ఇది వాహనం బరువును తగ్గిస్తుంది. ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
77
ఆధునిక సాంకేతికతతో ఇంధన ఆదా
ఆధునిక సాంకేతికతతో ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో ఇంధన ఖర్చులు తగ్గుతాయి. అలాగే, ట్రాఫిక్ జామ్‌లను తప్పించేందుకు GPS, ట్రాఫిక్ యాప్‌ల సహాయం తీసుకోవడం చాలా మంచిది. మార్కెట్లో లభ్యమయ్యే ఇంధన ఆదా పరికరాలను కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యతను పరిశీలించడం అవసరం