మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సవాళ్లను స్వీకరించి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇతరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, భయంతో ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తారు. అలాగే ఆర్థికంగా ఉన్నతి సాధించాలంటే.. ఈ గోల్డెన్ రూల్స్ పాటించండి!
నేటీ ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తుంది. ఈ తరుణంలో మార్పు అనివార్యం. చట్టాలు, మార్కెట్ ధోరణులు, కస్టమర్ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కానీ బిలియనీర్లు ఈ మార్పులను భయంగా కాకుండా, ఆ మార్పులనే అవకాశాలుగా మార్చుకుంటున్నారు. ముందస్తు ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు.
25
5 కీలక విజయ రహస్యాలు
పరిస్థితులను అర్థం చేసుకునే నైపుణ్యం
ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే.. మొదటగా మనం కస్టమర్ల కోణంలో ఆలోచిస్తారు. మార్కెట్ అవసరాలను తెలుసుకుంటార. తమని తాము కస్టమర్‌గా ఊహించుకోని, వాటికి సరిపోయే పరిష్కారాలను అందిస్తారు. అదే వారి వ్యాపార విజయానికి బలమైన పునాది.
అత్యవసర పరిస్థితుల్లో నియంత్రణ
నిజమైన నాయకులు.. తీవ్రమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఆలోచించగలరు. అవసరమైతే నెమ్మదిగా, అవసరమైన చోట వేగంగా స్పందించి ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు.
35
నూతన ఆవిష్కరణలు
ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం
సాధారణంగా కొత్త ఆవిష్కరణలు చేయడానికి సమయం అవసరం అవుతుంది. కానీ, విజేతలు ముఖ్యంగా బిలియనీర్లు, ఏ పని చేస్తూ ఉన్నా మనసులో కొత్త ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ ఆలోచనలను వెంటనే ఆచరణలోకి తీసుకురావడమే వారి ప్రత్యేకత. వారి పనిలో ఆలోచన ఓ భాగంగా ఉంటుంది.
రిస్క్ తీసుకునే ధైర్యం
విజయం సాధించాలని భావించిన వారు ముందుగా ఓటమిని అంగీకరించగలగాలి. బిలియనీర్లు తమ చేతిలో ఉన్నదాన్ని కోల్పోయే అవకాశాన్ని కూడా భరించి, కొత్త మార్గాల్లో ప్రయాణించడానికి ధైర్యంగా ముందడుగు వేస్తారు. అదే వారి పెద్ద విజయాలకు నాంది.
వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. ఇతరులను నడిపించగల నైపుణ్యం మాత్రమే కాదు. వారితో కలిసి పనిచేయగల లక్షణం కూడా ఉండాలి. బిలియనీర్లలో ఈ రెండూ ఉంటాయి. ఇది టీంలో నమ్మకాన్ని పెంచి, బలమైన సహకారాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది.
55
బిలియనీర్ కావాలంటే ?
డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ, బిలియనీర్ కావాలంటే.. కేవలం డబ్బు సంపాదించడమే కాదు. మనస్తత్వం, నిర్ణయం తీసుకునే నైపుణ్యం, భవిష్యత్తును ఊహించగల శక్తి ఉండాలి. ఈ నైపుణ్యాలు కొందరికి సహజంగా ఉంటాయి, మరికొందరు కృషితో అభివృద్ధి చేసుకుంటారు. ఎవరైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే, వారే భవిష్యత్తులో బిలియనీర్లు అవుతారు.