Amazon Echo Show 5 : డిస్‌ప్లే, కెమెరా సహా అదిరిపోయే కొత్త ఫీచర్లతో అమెజాన్ ఎకో షో 5 విడుదల

Published : Jul 29, 2025, 11:48 AM IST

Amazon Echo Show: అమెజాన్ భారత్‌లో థర్డ్ జెనరేషన్ ఎకో షో 5 విడుదల చేసింది. ఇందులో 5.5" డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ కెమెరా, 2X బాస్, స్పష్టమైన ఆడియో సెటప్ ఉన్నాయి. 

PREV
15
అమెజాన్ కొత్త ఎకో షో 5.. భార‌త్ లో లాంచ్

అమెజాన్ తన కొత్త అలెక్సా-ఎనేబుల్డ్ స్మార్ట్ డివైస్ ఎకో షో 5 (థ‌ర్డ్ జెన‌రేష‌న్)ను భారత మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇది 5.5 అంగుళాల స్మార్ట్ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ కెమెరా, మెరుగైన బాస్‌తో కూడిన అత్యుత్తమ ఆడియో సెటప్ కలిగి ఉంది. మునుప‌టి జెన‌రేష‌న్ వేరియంట్ కంటే మెరుగైన సౌండ్ సిస్ట‌మ్ తో వ‌స్తోంది. రెండు రెట్లు అధిక ఆడియో సామ‌ర్థ్యం క‌లిగి ఉంది.

25
ఎకో షో 5 తో యూజ‌ర్ల‌ రోజువారీ పనులను మరింత సులభం

ఎకో షో 5 (3 థ‌ర్డ్ జెన్ ) డిజైన్ చిన్నదైనదైనా అత్యంత శక్తివంతమైనది. ఇందులో 5.5” స్మార్ట్ డిస్‌ప్లే, గోళాకార అంచులు, ఇన్ఫినిటీ కవర్ గ్లాస్ ఉన్నాయి. దీని ఇంటర్‌ఫేస్ మెరుగ్గా ఉండటంతో రాత్రిపూట కూడా వీక్షణ అనుభవం సులభంగా ఉంటుంది. ఇది వాతావరణ సమాచారాన్ని చూడటానికి, స్మార్ట్ హోం నియంత్రణను నిర్వహించడానికి, భద్రతా కెమెరాల వీడియో ఫీడ్స్‌ని వీక్షించేందుకు ఉపయోగపడుతుంది.

35
వినోదానికి అత్యుత్తమ ఎంపికగా ఎకో షో 5

1.7 అంగుళాల రియర్ ఫేసింగ్ స్పీకర్ ద్వారా ఈ డివైస్ గత తరం కంటే రెండు రెట్లు బాస్, మరింత స్పష్టమైన వాయిస్‌ను అందిస్తుంది. వినియోగదారులు Amazon Music, Apple Music, Spotify, JioSaavn వంటి ప్లాట్‌ఫామ్‌లలో పాటలు, ఆడియోబుక్స్‌ను అలెక్సా ద్వారా వాయిస్ కమాండ్‌తో వినొచ్చు. మల్టీ-రూమ్ మ్యూజిక్ ఫీచర్‌తో ఇంటి అన్ని గదులకూ సంగీతాన్ని పంచుకోవచ్చు.

45
అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో స్మార్ట్ లైఫ్

వినియోగదారులు అలెక్సా ద్వారా క్యాలెండర్ చూడటం, రిమైండర్‌లు పెట్టటం, షాపింగ్ లిస్టు తయారుచేయటం వంటి పనులను చేయవచ్చు. ఉదాహరణకు, “Alexa, add milk to the shopping list” అని చెప్పడం ద్వారా జాబితాలో చేర్చవచ్చు. అలాగే, “Alexa, turn off the lights at 10 p.m.” వంటి కమాండ్లు ఇవ్వడం ద్వారా ఇంటి ఇతర స్మార్ట్ పరికరాలను నియంత్రించవచ్చు.

ఎకో షో 5.. వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యత

కొత్త ఎకో షో 5 పలు ప్రైవసీ నియంత్రణలతో వస్తుంది. ఇందులో బిల్ట్-ఇన్ కెమెరా షట్టర్, మైక్రోఫోన్ ఆన్/ఆఫ్ బటన్, అలాగే వినియోగదారులు అలెక్సా యాప్ ద్వారా వాయిస్ రికార్డింగ్‌లను వీక్షించటం, తొలగించటం చేయగలుగుతారు. ప్రైవసీ హబ్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

55
అమెజాన్ ఎకో షో 5 ధర ఎంత?

చార్కోల్, క్లౌడ్ బ్లూ కలర్లలో లభ్యమవుతున్న ఈ డివైస్‌ను అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రస్తుతం రూ.10,999 తగ్గింపుతో అందుబాటులో ఉంది.

అమెజాన్ ఇండియా డివైసెస్ డైరెక్టర్ దిలీప్ ఆర్.ఎస్ మాట్లాడుతూ.. “కొత్త ఎకో షో 5 వినియోగదారుల జీవితాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందింది. ఇంటి పర్యవేక్షణ, స్మార్ట్ హోమ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ యాక్సెస్, హ్యాండ్స్ ఫ్రీ మ్యూజిక్ వినిపించటం వంటి అనేక ఉపయోగాలను ఇది అందిస్తుంది” అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories