FASTag Annual Pass: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్త FASTag రూల్స్ అమలు చేయనుంది. కొత్త విధానం ప్రకారం.. రూ.3,000 చెల్లిస్తే చాలు.. ఒక సంవత్సరం లేదా 200 టోల్స్ దాటవచ్చు. FASTag కొత్త రూల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణం చేసే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి FASTag ఏడాది పాస్ ను ప్రారంభించనుంది. ఒక్కసారి రూ. 3వేలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఒక సంవత్సరం లేదా గరిష్టంగా 200 సార్లు టోల్ గేట్ దాటవచ్చు. దీనివల్ల టోల్ బూత్ ల వద్ద రద్దీతో పాటు వాహనదారులకు ఖర్చు కూడా తగ్గనుంది.
25
రూ.7 వేల వరకు ఆదా!
FASTag Annual Pass తో 7వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు 200 టోల్స్ దాటడానికి రూ.10,000 వరకు ఖర్చవుతుంది. ఈ పాస్ ద్వారా రూ.3,000 మాత్రమే ఖర్చవుతుంది. అంటే నేరుగా రూ.7,000 వరకు ఆదా అవుతుంది. మొదట.. ఈ పాస్‌ను ప్రైవేట్ వాహన యజమానులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకే ఇది వర్తిస్తుంది. బస్సు, లారీ లేదా టాక్సీ వంటి వాణిజ్య వాహనాలకు ఈ ఆఫర్ లేదు.
35
FASTag రూల్స్ :
ఈ పాస్ మీరు కొనుగోలు చేసిన నిర్ధిష్ట వాహనానికే చెల్లుతుంది. దాన్ని వేరే వాహనానికి మార్చలేరు. ఈ పాస్ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర రహదారులు, మున్సిపల్ రోడ్లపై ఈ పాస్ చెల్లదు. వాటికి ప్రత్యేకంగా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పాస్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని రద్దు చేయలేరు. డబ్బు కూడా తిరిగి ఇవ్వబడదు. గడువు ముగిసిన తర్వాత.. మళ్లీ రూ.3,000 చెల్లించి కొత్త పాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
55
FASTag Annual Pass ఎలా పొందాలంటే?
NHAI అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
మీ వాహన రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేయండి
మీరు వాడుతున్న FASTag యాక్టివ్‌గా ఉందో లేదా బ్లాక్ చేసి ఉందో ముందుగా చెక్ చేసుకోండి.
యాక్టివ్ గా ఉందనుకుంటే FASTag Annual Pass కోసం రూ.3,000లను ఆన్‌లైన్‌లో చెల్లించండి.
పేమెంట్ తర్వాత మీ పాస్ మీ పాస్ FASTag కి లింక్ అవుతుంది.