Gas Cylinder: సిలిండర్ త్వరగా అయిపోతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గ్యాస్ ఆదా..

Published : Mar 11, 2026, 12:30 PM IST

Gas Cylinder: వంట గ్యాస్ ధరలు పెరిగిన తరుణంలో, ఎల్‌పీజీ సిలిండర్‌ను పొదుపుగా వాడటం ఎంతో అవసరం. కేవలం కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటించడం ద్వారా మీ గ్యాస్ సిలిండర్ మరిన్ని రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. 

PREV
15
గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే చాలామంది గ్యాస్‌ను అనాలోచితంగా వాడటం వల్ల సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుంది. వంట చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ పాటిస్తే గ్యాస్ ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

25
బర్నర్ మంటను నియంత్రించడం

చాలామంది వంట చేసేటప్పుడు మంటను (Flame) పూర్తిగా పైకి పెంచుతారు. దీనివల్ల పాత్ర చుట్టూ మంట వృధా అవుతుంది. మంట ఎప్పుడూ పాత్ర కింది భాగం వరకే ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా వంటగదిలో వేడి కూడా తగ్గుతుంది.

35
బర్నర్ శుభ్రత

మీ గ్యాస్ స్టవ్ మంట నీలం రంగులో ఉంటే బర్నర్ శుభ్రంగా ఉందని అర్థం. ఒకవేళ ఎరుపు లేదా పసుపు రంగులో మంట వస్తుంటే బర్నర్‌లో దుమ్ము పేరుకుపోయిందని గుర్తించాలి. అప్పుడు బర్నర్‌ను గోరువెచ్చని నీరు, బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి.

45
పాత్రలు పొడిగా ఉండాలి

వంట పాత్రలను స్టవ్‌పై పెట్టేటప్పుడు అవి తడిగా లేకుండా చూసుకోవాలి. తడిగా ఉంటే ఆ నీటిని ఆవిరి చేయడానికి స్టవ్ ఎక్కువ గ్యాస్‌ను తీసుకుంటుంది. పాత్రలు పొడిగా ఉంటే వంట త్వరగా మొదలవుతుంది. సాధారణ పాత్రలతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల ఆవిరి ఒత్తిడికి ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

55
అవసరానికి మించి నీరు..

వంట చేసేటప్పుడు అవసరానికి మించి నీరు పోయకూడదు. నీరు ఎక్కువగా ఉంటే అది ఆవిరి అయ్యే వరకు గ్యాస్ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే బియ్యం, పప్పులు వంటి పదార్థాలను వండడానికి గంట ముందు నానబెడితే అవి చాలా త్వరగా ఉడుకుతాయి. ఇది గ్యాస్ ఆదా చేయడానికి ఒక మంచి ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories