Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. ఎవర్ గ్రీన్ బిజినెస్‌లు ఇవే..

Published : Mar 11, 2026, 12:06 PM IST

Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? సీజన్‌తో సంబంధం లేకుండా లాభాలను అందించే 7 అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
15
ఎవర్ గ్రీన్ వ్యాపారాలు

చాలామంది వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు కానీ, అది కేవలం ఒక సీజన్‌కే పరిమితం అవుతుందేమోనని భయపడుతుంటారు. అయితే, సీజన్‌తో సంబంధం లేకుండా, సంవత్సరం పొడవునా లాభాలను అందించే కొన్ని ఎవర్ గ్రీన్ వ్యాపారాలు ఉన్నాయి.

25
సంవత్సరం పొడవునా లాభాలను..

ఫుడ్ బిజినెస్ (Food Business):

మనిషికి ఆహారం ప్రాథమిక అవసరం. కాబట్టి నాణ్యమైన ఆహారాన్ని అందించే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు లేదా క్లౌడ్ కిచెన్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

మెడికల్ షాపు (Medical Store):

ఆరోగ్యం విషయంలో ఎవరూ రాజీ పడరు. మందుల దుకాణాలు అన్ని కాలాల్లోనూ లాభసాటిగా నడిచే వ్యాపారాలు.

35
ఇవి బెస్ట్ ఆప్షన్స్

ఎడ్యుకేషన్ & లెర్నింగ్:

విద్య అనేది నిరంతర ప్రక్రియ. ట్యూషన్ సెంటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ క్లాసులు లేదా ఆన్‌లైన్ కోర్సులకు ఏడాది మొత్తం ఆదరణ ఉంటుంది.

క్లీనింగ్ & లాండ్రీ సర్వీసెస్:

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటిని శుభ్రం చేసుకోవడానికి లేదా బట్టలు ఉతకడానికి సమయం ఉండటం లేదు. అందుకే ప్రొఫెషనల్ క్లీనింగ్, లాండ్రీ సర్వీసులకు మంచి డిమాండ్ పెరుగుతోంది.

45
స్థానికంగా పెట్టుకోవచ్చు..

కిరాణా షాపు (Grocery Store):

నిత్యావసర వస్తువుల విక్రయం అనేది ఎప్పుడూ ఫెయిల్ అవ్వని వ్యాపారం. ప్రతి ఇంటా ప్రతిరోజూ అవసరమయ్యే వస్తువులే దీనికి ప్రధాన బలం.

ప్యాకేజింగ్ & డెలివరీ సర్వీసెస్:

ఈ-కామర్స్ రంగం పుంజుకుంటున్న తరుణంలో వస్తువులను ప్యాక్ చేయడం, కస్టమర్లకు చేరవేసే డెలివరీ బిజినెస్ లో మంచి లాభాలు ఉన్నాయి.

55
ఉత్పత్తుల రంగం..

అగ్రికల్చర్ & డెయిరీ బిజినెస్:

పాలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు లేకుండా రోజు గడవదు. ఈ రంగంలో స్వల్ప పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

మీరు కూడా ఏదైనా వ్యాపారం ప్రారంభించి సొంతంగా ఎదగాలనుకుంటే, పైన పేర్కొన్న రంగాలలో మీ ఆసక్తికి తగ్గట్టుగా ఒకదానిని ఎంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories