Aadhaar Card Loan: పర్సనల్ లోన్ పొందాలంటే చాలా కష్టపడాలి. మన వ్యక్తిగత, ఆస్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. పైనా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది పడకుండా కేవలం ఆధార్ కార్డుతో కొన్ని నిమిషాల్లో ₹10,000 లోన్ పొందవచ్చు. ఎలా ?
నిమిషాల్లో ఆధార్ కార్డుతో ₹10,000 వరకు లోన్‌ను పొందవచ్చు. ఎలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్ లేకుండా త్వరితగతిన ఈ లోన్ పొందవచ్చు. కేవలం ఆధార్ కార్డును మాత్రమే చూపించాలి. ఆ వెంటనే రూ.10,000 మీ ఖాతాకు బదిలీ అవుతాయి.
24
ఆధార్ కార్డుపై రుణం ఎవరు ఇస్తారు?
ప్రభుత్వ బ్యాంకులు పర్సనల్ లోన్స్ అందించడం చాలా తక్కువ. అది కూడా మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే.. మీరు లోన్ ఇస్తారు. లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డ్ ఉపయోగిస్తే ప్రైవేట్ బ్యాంకులు సులభంగా రుణం ఇస్తాయి. పాన్ కార్డ్ లేకుంటే, ఆధార్ కార్డ్ ద్వారా NBFCలు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
34
ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే ఆధార్ కార్డుతో సులభ రుణం పొందవచ్చు. ముందుగా మీరు NBFC, ఫిన్‌టెక్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, అవసరమైన వివరాలను అందించడం ద్వారా త్వరగా వ్యక్తిగత రుణం పొందవచ్చు.
21 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం చేసే వ్యక్తులు ఆధార్ కార్డ్ సహాయంతో వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తప్పనిసరి గా యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉండాలి.