EPFO Vishwas 2026: యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావద్దు !

Published : Jul 21, 2026, 12:17 PM IST

EPFO Vishwas 2026: ఈపీఎఫ్‌ఓ పాత వివాదాలు, జరిమానాల పరిష్కారానికి 'విశ్వాస్ 2026' స్కీమ్ ప్రారంభించింది. డిజిటల్ పద్ధతిలో 6 నెలల పాటు ఈ వన్ టైమ్ సెటిల్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ విశ్వాస్ పూర్తి వవరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ఈపీఎఫ్‌ఓ 'విశ్వాస్ 2026' అంటే ఏమిటి?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను, జరిమానా కేసులను పరిష్కరించడానికి 'విశ్వాస్ 2026' (VISHWAS 2026) అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక స్వచ్ఛంద వివాద పరిష్కార కార్యక్రమం. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. పీఎఫ్ చట్టాల ఉల్లంఘన వల్ల వచ్చే జరిమానాలు, నష్టపరిహారం కేసులను కోర్టుల దాకా తీసుకెళ్లకుండా, సామరస్యపూర్వకంగా సెటిల్ చేసుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇది పూర్తిగా పారదర్శకంగా, డిజిటల్ రూపంలో సాగే ఒక వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్.

ఈ పథకం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?

కేంద్ర శ్రమ, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ 'విశ్వాస్ 2026' పథకం 2026 జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైన తేదీ నుంచి సరిగ్గా 6 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యజమానులు తమ పాత వివాదాలను, కోర్టు కేసులను ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవడానికి ఈ 6 నెలల వ్యవధిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవచ్చు.

24
ఏయే కేసులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది?

'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952' లోని సెక్షన్ 14B, 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' లోని సెక్షన్ 128 కింద నమోదైన కేసులకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా నాలుగు రకాల కేసులలో ఈ వెసులుబాటు ఉంటుంది..

• కోర్టు కేసులు: జరిమానా లేదా పరిహారం ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులు లేదా ఇతర న్యాయ స్థలాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు.

• పెండింగ్ రికవరీ కేసులు: చివరి నోటీసులు జారీ అయి, ఇంకా సొమ్ము పూర్తిగా వసూలు కాకుండా రికవరీ సర్టిఫికేట్ జారీ అయిన కేసులు.

• నోటీసులు ఇచ్చిన కేసులు: ఈపీఎఫ్‌ఓ నుంచి నోటీసులు అంది, ఇంకా చివరి జరిమానా ఆదేశాలు రాక పెండింగ్‌లో ఉన్న కేసులు.

• ప్రారంభ దశలోని కేసులు: జరిమానాల సంబంధించి ఇంకా నోటీసులు కూడా జారీ కాకుండా ప్రాథమిక దశలో ఉన్న వ్యవహారాలు.

34
జరిమానాలు తగ్గుతాయి.. అప్లై చేయడం ఎలా?

ఈ స్కీమ్ కింద 2024 జూన్ 14 కంటే ముందు జరిగిన ఉల్లంఘనలకు సంబంధించి విధించే జరిమానాలను చాలా వరకు తగ్గించారు. తగ్గించిన రేట్ల వివరాలు ఇవే..

• 2 నెలల వరకు ఆలస్యమైతే: నెలకు 0.25 శాతం జరిమానా.

• 2 నుంచి 4 నెలల వరకు ఆలస్యమైతే: నెలకు 0.50 శాతం జరిమానా.

• 4 నెలల కంటే ఎక్కువ ఆలస్యమైతే: నెలకు 1.00 శాతం జరిమానా విధిస్తారు.

యాజమాన్యాలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందడానికి ఈపీఎఫ్‌ఓ ఎంప్లాయర్ పోర్టల్ (EPFO Employer Portal) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఇ-సైన్ తప్పనిసరి. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని జోనల్, రీజినల్, డిస్ట్రిక్ట్ ఆఫీసులలో ప్రత్యేకంగా విశ్వాస్ సెల్స్ ఏర్పాటు చేశారు.

44
పీఎఫ్ హోల్డర్లు, ఎంప్లాయర్లకు కలిగే ప్రయోజనం ఏంటి?

ప్రాథమికంగా ఇది కంపెనీ యాజమాన్యాలు, ఈపీఎఫ్‌ఓ మధ్య ఉన్న వివాదాలను క్లియర్ చేసే స్కీమ్ అయినప్పటికీ, దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులకు చాలా మేలు జరుగుతుంది. పెండింగ్ కేసులు క్లియర్ అవ్వడం వల్ల, చాలా కాలంగా ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఉద్యోగుల పీఎఫ్ క్లైమ్‌లు, నిధుల విడుదల వేగంగా పూర్తవుతాయి. కోర్టు వివాదాల వల్ల వేల రూపాయల డబ్బులు, సమయం వృథా కాకుండా కంపెనీలకు ఆదా అవుతుంది. మరోవైపు ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ లభిస్తుంది. పీఎఫ్ వ్యవస్థలో మరింత పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories