EPFO: ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?

Published : Jun 30, 2025, 12:32 PM IST

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని EPF సభ్యుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. అధికారికంగా ఎలాంటి మెసేజ్‌లు చేయ‌క‌పోయినా, చాలా మంది అకౌంట్స్‌లో బ్యాలెన్స్ పెరిగాయి. ఇంత‌కీ ఎంత వ‌డ్డీ యాడ్ అయిందో ఎలా తెలుసుకోవాలంటే. 

PREV
16
2024-25కు 8.25% వడ్డీ రేటు

ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. ఫిబ్రవరిలో EPFO బోర్డు ఈ వడ్డీ రేటును నిర్ధారించింది. ప్రభుత్వ ఆమోదంతో EPFO దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తోంది. ఈ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా కొంత మంది ఖాతాల్లో వ‌డ్డీ జ‌మ అయ్యింది.

26
EPF పాస్‌బుక్‌లో వడ్డీ చూసే విధానం

మీ వడ్డీ జమ అయ్యిందా లేదానేది తెలుసుకోవాలంటే EPFO పాస్‌బుక్ పోర్టల్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

* ముందుగా EPFO పాస్‌బుక్ లాగిన్ పేజ్‌కి వెళ్లండి: https://passbook.epfindia.gov.in

* మీ UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

* అనంత‌రం మీ EPF అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్‌కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.

* లాగిన్ అయ్యాక మీ మొత్తం బ్యాలెన్స్ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఉద్యోగి, యజమాని వాటాలు విడిగా క‌నిపిస్తుంది.

* అనంత‌రం పైన క‌నిపించే “Passbook” బటన్ క్లిక్ చేసి, వేర్వేరు Member IDsపై వడ్డీ వివరాలను చూడండి.

36
పాస్‌బుక్‌లో ఏం కనిపిస్తుంది?

పాస్‌బుక్‌లో మీరు ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్లు, వడ్డీని వేర్వేరు రంగుల్లో చూడవచ్చు. ఆ రంగాలపై కర్సర్ ఉంచితే మీ ఖాతాకు జమైన క‌చ్చితమైన మొత్తం కనిపిస్తుంది. పాస్‌బుక్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

వడ్డీ కనిపించకపోతే?

కొన్నిసార్లు వడ్డీ జమ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. మీరు కొన్ని రోజులు ఆగి మళ్లీ చెక్ చేయాలి. అయినా సమస్య అలాగే ఉంటే.. EPFO వెబ్‌సైట్‌లో "Grievance" సెక్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

46
ఉమాంగ్ యాప్ ద్వారా కూడా

ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వ యాప్ అయిన ఉమాంగ్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ముందుగా ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంత‌రం యూఏఎన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. దీంతో మీ అకౌంట్‌లో మొత్తం ఎంత ఉంది.? లాంటి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

56
ఆటో సెటిల్‌మెంట్ ప‌రిమితి పెంపు

ఈపీఎఫ్‌ఓ (EPFO) సభ్యులకు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ లేదా ప్రావిడెంట్ ఫండ్‌లో భాగంగా ఉండే నగదు అవసరాల కోసం తీసుకునే ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటి వరకు రూ.1 లక్షగా ఉన్న ఈ పరిమితిని ఏకంగా రూ.5 లక్షల వరకు పెంచారు.

66
మ‌రింత వేగంగా

కోవిడ్‌ కాలంలో ప్రవేశపెట్టిన ఈ ఆటో సెటిల్‌మెంట్ విధానం, కంప్యూటరైజ్డ్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. ఎవరైనా సభ్యుడు తన EPF ఖాతాకు సంబంధించి KYC వివరాలు, బ్యాంక్ వివ‌రాలు అప్డేట్ చేస్తే ఆ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తుంది.

దీంతో క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం భారీగా త‌గ్గుతుంది. సాధారణంగా 3–4 రోజులలోపు క్లెయిమ్ పూర్తి అవుతుంది. వైద్య ఖర్చులు, వివాహం, ఉన్నత విద్య, లేదా ఇంటి కొనుగోలు వంటి అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories