ఈ రోజుల్లో విద్య, గృహ నిర్మాణం, వైద్య అవసరాలు, వ్యాపార పెట్టుబడులు వంటి అనేక అవసరాల కోసం రుణాలు తీసుకోవడం సాధారణమే అయింది. కానీ అవసరం ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా అప్పు తీసుకోవాలి అన్న ఆలోచన పెద్ద ప్రమాదమే అవుతుంది. ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకోకుండా తీసుకునే రుణం జీవితంపై తీవ్ర భారం మోపే అవకాశం ఉంది.
29
అవసరానికి సరిపోయే రుణమే
అవసరానికి సరిపోయే రుణమే తీసుకోవాలి వినోదం కోసం, తాజా ఫ్యాషన్ వస్తువుల కోసం లేదా సెలవుల ప్రయాణాలకు అప్పు తీసుకోవడం అంత మంచిది కాదు. విద్య, ఇల్లు కొనుగోలు, వ్యాపార అభివృద్ధి వంటి అవసరాలకు అప్పు తీసుకుంటే అది మంచి పెట్టుబడిగా మారుతుంది.
39
రుణ రకాలపై స్పష్టత
రుణ రకాలపై స్పష్టత బ్యాంకులు రెండు రకాల రుణాలు ఇస్తాయి:
తనఖా రుణం (Secured Loan): ఆస్తిని గిరవు పెట్టి తీసుకోవాలి. వడ్డీ తక్కువగా ఉంటుంది.
తనఖా లేని రుణం (Unsecured Loan): ఆస్తి అవసరం లేదు కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
వడ్డీ రేటులు, ఇతర ఛార్జీల పరిశీలన ఒకే రకమైన రుణానికి కూడా వడ్డీ రేట్లు బ్యాంకు వారీగా మారతాయి. కనీసం 3–4 బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చాలి. ఇతర రుసుములు (ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ ఛార్జీలు) గురించి ముందుగా తెలుసుకుని అవసరంలేనివి తగ్గించేందుకు చర్చించాలి.
59
EMI ప్లానింగ్
EMI ప్లానింగ్ – ఆదాయానికి తగ్గట్టుగా రుణం తీసుకునే ముందు మీ ఆదాయానికి తగ్గట్టుగా ఈఎంఐల్ని ప్లాన్ చేయాలి. సాధారణంగా, ఈఎంఐలు నెలవారీ ఆదాయంలో 30% మించకూడదు. అప్పటికే ఉన్న ఖర్చులు, అత్యవసర నిధులు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి.
69
క్రెడిట్ స్కోరు
క్రెడిట్ స్కోరు – ఎంత ముఖ్యమో తెలుసుకోండి క్రెడిట్ స్కోరు మంచి స్థాయిలో ఉంటే రుణం తక్కువ వడ్డీకి లభిస్తుంది. పాత రుణాలను సకాలంలో చెల్లించడం, క్రెడిట్ కార్డ్ బకాయిలు తగ్గించడం ద్వారా స్కోరు మెరుగుపరచవచ్చు.
79
రుణ సంస్థ ఎంపికలో జాగ్రత్త
రుణ సంస్థ ఎంపికలో జాగ్రత్త ప్రభుత్వ బ్యాంకులు, ఆర్బీఐ గుర్తించిన NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచే రుణం తీసుకోవాలి. మొబైల్ యాప్‌లు లేదా వ్యక్తిగతంగా డబ్బు ఇచ్చే అనధికార సంస్థల నుంచి తీసుకోవడం ప్రమాదకరం.
89
ప్రీపేమెంట్ పాలసీ
ప్రీపేమెంట్ పాలసీ గురించి ముందుగానే తెలుసుకోండి ముందుగానే రుణాన్ని పూర్తిగా చెల్లించాలనుకుంటే ఆ కంపెనీ ప్రీపేమెంట్ పై జరిమానా వసూలు చేస్తుందా లేదా అనేది ముందే తెలుసుకోవాలి.
పన్ను మినహాయింపులు పొందండి హౌస్ లోన్, విద్య రుణాలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే, అకౌంటెంట్ సలహా తీసుకోవడం మంచిది.
99
మంచి రుణం vs చెడు రుణం
మంచి రుణం vs చెడు రుణం
మంచి రుణం: అభివృద్ధికి దోహదపడే రుణాలు – విద్య, ఇల్లు, వ్యాపారం.
చెడు రుణం: తాత్కాలిక కోరికల కోసం తీసుకునే రుణాలు – ఫ్యాషన్, ట్రిప్స్.