EPFO: ప్రతీ నెల ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ సొమ్మును అత్యవసర పరిస్థితుల్లో కొంత మొత్తంలో తీసుకోవచ్చే విషయం తెలిసిందే. అయితే దీనికి ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్లైమ్ చేసుకోవడం లాంటి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇదంతా మారనుంది.
భవిష్యనిధి చందాదారులకు ఒక పెద్ద మార్పు రాబోతోంది. బ్యాంకు ఖాతాల్లాగే, EPFO సభ్యులు తమ పీఎఫ్ మొత్తాన్ని ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశముందని సమాచారం.
25
తుది నిర్ణయం ఎప్పుడు?
ఈ సదుపాయం అమలుపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు (CBT) అక్టోబర్ రెండో వారంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. మొదట ఈ సర్వీస్‌ను జూన్‌లో ప్రారంభించాలని కార్మికశాఖ భావించినా, విత్‌డ్రా పరిమితులపై చర్చ అవసరం ఉండడంతో కొంత వాయిదా పడింది.
35
విత్‌డ్రా పరిమితులపై చర్చ
నగదు ఉపసంహరణలకు గరిష్ట పరిమితి ఉండాలా లేదా అన్న అంశంపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. పరిమితులు లేకపోతే ‘భవిష్యనిధి’ అసలు ఉద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే లిమిట్ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రానున్నాయి.
ప్రస్తుతం EPFOకి 7.8 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద కలిపి దాదాపు రూ. 28 లక్షల కోట్లు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. అత్యవసర సందర్భాల్లో సభ్యులు త్వరగా డబ్బులు పొందేలా ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
55
ప్రత్యేక కార్డు ద్వారా విత్‌డ్రా
EPFO, బ్యాంకులు, ఆర్‌బీఐతో కలిసి అవసరమైన ఐటీ మౌలిక వసతులు సిద్ధం చేసింది. సభ్యులకు ప్రత్యేక EPFO కార్డు జారీ చేయనున్నారు. ఇది సాధారణ ఏటీఎం కార్డు మాదిరిగానే పనిచేస్తుంది. ఒకసారి CBT ఆమోదం లభించిన తర్వాత, విత్‌డ్రాల నిబంధనలు, పరిమితులపై స్పష్టత రానుంది.