Paytm: మీ ఫోన్‌లో పేటీఎమ్ యాప్ ఉందా.? అయితే మీ దగ్గర రూ. 60 వేలు ఉన్నట్లే

Published : Sep 24, 2025, 02:40 PM IST

Paytm: డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో డిజిట‌ల్ వాలెట్ సంస్థ‌ల మ‌ధ్య కూడా పోటీ పెరుగుతోంది. దీంతో యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలో ర‌క‌ర‌కాల ఆఫ‌ర్ల‌ను, ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నాయి.  

PREV
15
పేటీఎం కొత్త సర్వీస్

పేటీఎం “పోస్ట్‌పెయిడ్” క్రెడిట్ లైన్ సేవను సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో భాగస్వామ్యంగా ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు ప్రీ-అప్రూవ్‌డ్ క్రెడిట్ లిమిట్‌తో తక్షణమే చెల్లింపులు చేయగలరు. బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకున్నా, ఈ క్రెడిట్ లిమిట్ ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి. దీని ద్వారా యూజర్లు నెలకు గరిష్టంగా రూ.60 వేలు వరకు ఉపయోగించుకోవచ్చు.

25
ఈ క్రెడిట్ లైన్ ఎక్కడ ఉపయోగపడుతుంది?

* QR కోడ్ స్కాన్ చేసి షాపింగ్ చేసుకోవ‌చ్చు.

* ఆన్‌లైన్ కొనుగోలు

* యుటిలిటీ బిల్స్ (కరెంట్, నీటి బిల్లులు వంటివి). అయితే వ్యక్తిగతంగా ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపించడానికి (P2P ట్రాన్స్ఫర్) మాత్రం ఈ సదుపాయం ఉపయోగించలేరు.

35
వడ్డీ, చెల్లింపుల విధానం

∗ నెలకు రూ.60 వేలు వరకు క్రెడిట్ లైన్ ఉపయోగించుకోవచ్చు.

∗ వినియోగించిన మొత్తాన్ని 30 రోజుల్లో వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాలి.

*  ప్రతి నెల 1వ తేదీన బిల్లు జ‌న‌రేట్ అవుతుంది.

* గడువు లోపు చెల్లిస్తే అదనపు వడ్డీ ఉండదు, ఆలస్యం అయితే ఫీజు వర్తిస్తుంది.

45
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

* ముందుగా పేటీఎం యూపీఐ యాప్ ఓపెన్ చేయాలి.

* మర్చంట్ QR కోడ్ స్కాన్ చేయాలి.

* పేమెంట్ సమయంలో “క్రెడిట్ లైన్” ఆప్షన్ ఎంచుకోవాలి.

* సాధారణ UPI మాదిరిగానే పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలి.

* ఒకసారి పేటీఎం పోస్ట్‌పెయిడ్ యాక్టివేట్ చేసుకున్నాక, వెంటనే వినియోగం మొదలవుతుంది.

55
వినియోగదారులకు లాభాలు

* బ్యాంకులో డబ్బు లేకపోయినా సౌకర్యవంతమైన చెల్లింపులు చేసుకోవ‌చ్చు.

* బిల్లింగ్ సైకిల్ ప్రకారం తక్కువ కాలంలో రీపేమెంట్ ఆప్షన్

* డిజిటల్ లావాదేవీల్లో భద్రత, సౌలభ్యం

Read more Photos on
click me!

Recommended Stories