DA Hike: అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, దీని కోసం ఎంత డబ్బు అవసరమంటే..

Published : Sep 24, 2025, 03:12 PM IST

దసరా వచ్చిందంటే డీఏ పెంపు (DA hike) కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. దీంతో ఉద్యోగుల మొత్తం జీతం పెరుగుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో తెలుసుకోండి.

PREV
14
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ప్రతి ఏడాది ఎంతో ఆశగా ఎదురు చూస్తారు.  తమ తదుపరి డీఏ పెంపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు.  పండుగ సీజన్‌కు ముందు ఈ ప్రకటన వస్తుంది. అక్టోబర్ 1 నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుంది.

24
మూడు శాతం పెంపు

ఈ ఏడాది మార్చిలో డీఏ పెంపు జరిగింది.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 55 శాతం డీఏ  పొందుతున్నారు. ఇప్పుడు మరో  3% అదనపు పెంపు జరగబోతోంది. ఉద్యోగులకు పండుగ వేళ ఇది ఆనందాన్ని కలిగిస్తుంది.

34
ఎంత భారం పడుతుందో తెలుసా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు 58 శాతానికి పెరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా 8000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఇది పెద్ద మొత్తమే అయినా ఉద్యోగులకు ఈ మొత్తం చెల్లించక తప్పదు.

44
ద్రవ్యోల్భణం పెరగడం వల్ల

ప్రతి ఏడాది ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా వారి జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేయడానికి డీఏను పెంచుతారు. దీన్నే డియర్ నెస్ అలవెన్స్ అంటారు.

Read more Photos on
click me!

Recommended Stories