Roof Cooling: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలంటే ఇదొక్కటి ఉంటే చాలు

Published : May 01, 2026, 01:47 PM IST

Roof Cooling: వేసవి వస్తే చాలు, ఇంట్లో అగ్గి పెట్టినట్లే ఉంటుంది. ఏసీ, కూలర్లు వేసినా వేడి మాత్రం తగ్గదు. దీనికి కారణం ఇంటి పైకప్పు. ఎండ వేడి నేరుగా ఇంట్లోకి చేరుతుంది. అయితే ఈ వేసవి తాపం నుంచి మీ ఇంటిని కూల్‍గా ఉంచాలంటే ఈ పద్ధతులు పాటిస్తే సరి.  

PREV
14
ఎండ వేడి నుంచి ఉపశమనం ఎలా?

వేసవి కాలంలో ఎండ తీవ్రతకు మేడలు, ఇంటి పైకప్పులు చాలా వేడెక్కుతాయి. సూర్యకాంతి నేరుగా ఇంటి పైకప్పు మీద పడటం వల్ల ఇంట్లో కూడా హీట్ పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే 'రూఫ్ కూలింగ్' ఒక అద్భుతమైన, తెలివైన పరిష్కారం. ఇది ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడమే కాకుండా కరెంట్ వినియోగం భారీగా తగ్గిపోతుంది కూడా.

24
రూఫ్ కూలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు

రూఫ్ కూలింగ్ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గి, నెలవారీ విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. వేసవి కాలంలో కూడా ఇంట్లో ఉండే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎండ వేడికి పైకప్పు పగుళ్లు రాకుండా, దెబ్బతినకుండా ఉంటుంది. రూఫ్ కూలింగ్ చేయడం వల్ల పైకప్పు ఎక్కువకాలం మన్నుతుంది.

34
రూఫ్ కూలింగ్ పద్ధతులు

వైట్ రిఫ్లెక్టివ్ రూఫ్ కోటింగ్

ఇది తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి. పైకప్పుపై తెల్లటి రంగు లేదా ప్రత్యేకమైన కూల్ రూఫ్ పెయింట్ వేయడం వల్ల 80 శాతానికి పైగా ఎండ వేడి డైరక్ట్ గా ఇంట్లోకి రాదు.

కూల్ రూఫ్ టైల్స్

సాధారణ టైల్స్ లేదా కాంక్రీటుకు బదులుగా వేడిని గ్రహించని ప్రత్యేకమైన కూల్ రూఫ్ టైల్స్ లేదా బ్రిక్స్ ను పైకప్పుపై అమర్చవచ్చు.

గ్రీన్ రూఫ్

పైకప్పుపై మొక్కలు, చిన్న గార్డెనింగ్ వేసుకోవడం వల్ల ఇల్లు కూల్‍గా ఉంటుంది. ఇది వేడిని అడ్డుకోవడమే కాకుండా, గాలి కూడా ఫ్రెష్‍గా ఉంటుంది.

థర్మల్ ఇన్సులేషన్

థర్మాకోల్, పాలీయురేథేన్ ఫోమ్ లేదా ప్రత్యేక ఇన్సులేషన్ బోర్డులను వాడటం వల్ల వేడి ఇంట్లోకి చొచ్చుకురాకుండా అడ్డుకోవచ్చు. 

44
ఖర్చు ఎక్కువైనా దీర్ఘకాలం ప్రయోజనకరం

ఈ రూఫ్ కూలింగ్ పద్ధతులకు ప్రారంభంలో కొంత ఖర్చు అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి నిర్వహణ కూడా చాలా సులభం. ఉదాహరణకు, కూల్ రూఫ్ పెయింట్ వేసిన తర్వాత ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి తిరిగి కోటింగ్ వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories