Today Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట, ఒక్కరోజులో బంగారం యూటర్న్

Published : May 01, 2026, 11:33 AM IST

Today Gold Rate: బంగారం ధరలు ఒక్కరోజులోనే యూటర్న్ తీసుకున్నాయి. ? నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేట్… ఇవాళ పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు, పసిడి ప్రేమికులను కంగారు పడుతున్నారు.

PREV
14
స్వల్పంగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో తాజా పరిస్థితి చూస్తే 24 క్యారెట్ బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ కూడా దిగివచ్చింది. వెండి ధర కూడా భారీగా క్షీణించింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఇది తాత్కాలిక పతనమా? లేక ఇంకా తగ్గుదల కొనసాగుతుందా? మరో ఆసక్తికర విషయమేంటంటే...జనవరిలో ఆల్ టైమ్ హైని తాకిన బంగారం… ఇప్పుడు భారీగా పడిపోయింది. అంటే ఇది కొనడానికి సరైన టైమా? లేక ఇంకా వేచి చూడాలా?

24
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం

అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలం, గ్లోబల్ టెన్షన్స్ ఇవన్నీ కలిసి ఇవి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇటీవల తీవ్ర ఊగిసలాట చూపిస్తున్నాయి. ఒక రోజు భారీగా పెరిగితే, మరుసటి రోజు తగ్గిపోవడం వల్ల పెట్టుబడిదారులు మాత్రమే కాదు, సాధారణ కొనుగోలుదారులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేసే వారికి ఈ మార్పులు మరింత ప్రభావం చూపుతున్నాయి. 

34
24 క్యారెట్లపై రూ.380 తగ్గుదల

మే 1న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.380 తగ్గి రూ.1,52,350 వద్దకు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం రూ.350 తగ్గి రూ.1,39,650గా నమోదైంది. ఇదే సమయంలో వెండి ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.2,65,000గా ఉండగా, తులం వెండి ధర సుమారు రూ.2,650గా ఉంది. 

44
సేఫ్ హెవెన్‌గా బంగారం

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు లేదా ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్‌గా భావించే బంగారం వైపు మొగ్గుచూపుతారు. అదే సమయంలో డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గే అవకాశమూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే, దశలవారీగా పెట్టుబడి పెట్టడం ఉత్తమంగా భావిస్తున్నారు నిపుణులు.

మార్కెట్ మార్పులను గమనిస్తూ, అవసరానికి తగ్గట్టుగా సరైన సమయంలో కొనుగోలు చేయడం మంచి నిర్ణయమని నిపుణులు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories