Gold vs Real Estate: డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అందుకే చాలా మంది తమ సేవింగ్స్‌ను సరైన చోట పెట్టి భవిష్యత్తుకు సంపద సృష్టించాలని భావిస్తారు. ఈ క్రమంలో “బంగారం మంచిదా? రియల్ ఎస్టేట్ మంచిదా?” అన్న సందేహం రావడం సహజం.
ఒకప్పుడు చాలామంది తమ పొదుపులను బంగారంలో పెట్టేవారు. అది సురక్షితంగా ఉంటుంది, అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు అనే నమ్మకం ఉండేది. తర్వాత స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరిగింది. కానీ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతున్నారు. ఇళ్లు, ప్లాట్లు కొనడం ద్వారా మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నారు.
25
బంగారం ప్రాధాన్యం
మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఆభరణం మాత్రమే కాదు, భద్రత కూడా. ఎమర్జెన్సీ సమయంలో అమ్ముకుని డబ్బు పొందవచ్చు కాబట్టి చాలామంది బంగారంలో పెట్టుబడి పెడతారు. అదనంగా గోల్డ్ బాండ్స్, ETFలు, డిజిటల్ గోల్డ్ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
35
రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు మళ్లుతున్నారు?
ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో, అదే డబ్బుతో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఆస్తులపై ప్రజలు దృష్టి పెట్టారు. కొన్ని సంవత్సరాలు మందగించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. సాధారణంగా మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే, తర్వాత బూమ్ వచ్చినప్పుడు మంచి లాభాలు వస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్‌ను ఎంచుకుంటున్నారు.
ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం 20 సంవత్సరాల క్రితం రూ. 1 లక్ష బంగారంలో పెట్టినట్లయితే అది ఇప్పుడు సుమారు రూ. 15.5 లక్షలు అవుతుంది (సుమారు 15% వృద్ధి). అదే డబ్బు రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లయితే రూ. 24 లక్షల నుంచి రూ. 32 లక్షల వరకు అవుతుంది (సుమారు 28% వృద్ధి). ఇక అద్దె రూపంలో వచ్చే అదనపు ఆదాయం కూడా కలిపితే రియల్ ఎస్టేట్ రాబడులు ఇంకా ఎక్కువగా ఉంటాయి.
55
పెట్టుబడి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
బంగారం కొనడం చాలా సులభం. ఎప్పుడైనా కొనచ్చు, అమ్మచ్చు. కానీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే సమయం, ప్రణాళిక అవసరం. కొనడం, అమ్మడం అంత తేలిక కాదు. సింపుల్‌గా చెప్పాలంటే షార్ట్ టర్మ్‌లో బంగారం మంచి ఎంపికగా చెప్పొచ్చు. లాంగ్ టర్మ్‌లో రియల్ ఎస్టేట్ ఎక్కువ లాభాలు ఇవ్వగలదు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.