Gold purity : మీరు గోల్డ్ కొంటున్నారా? బంగారం నాణ్యతను ఈజీగా చెక్ చేయండిలా..

Published : Jun 01, 2025, 12:08 PM IST

Gold purity : మనదేశంలో భారీగా బంగారం కొనుగోళ్లు జరుగుతుంటాయి. బంగారం అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మారింది. అలాంటి బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ బంగారం నకిలీదా.. లో క్వాలిటీదా? స్వచ్ఛమైనదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు

PREV
14
తనిఖీ తప్పనిసరి

రోజురోజుకీ బంగారం ధర పెరుగుతున్నందున, దాని నాణ్యతను పరీక్షించిన తర్వాతే బంగారు నగలను కొనుగోలు చేయడం తప్పనిసరి. మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ తరుణంలో బంగారం కొనుగోలు మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. నగలపై హాల్మార్క్ నిబంధనలను అమలు చేసింది. ఇలా చేయడం వల్ల నాణ్యమైన బంగారు నగలు అందరికీ అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు నగల దుకాణాల్లో హాల్మార్క్ వేసిన నగలను మాత్రమే విక్రయించాలి.

24
హాల్మార్క్ తప్పని సరి

బంగారం నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. 18, 22 లేదా 20 క్యారెట్ల బంగారు నగలు కొనేటప్పుడు "హాల్మార్క్" ముద్ర ఉందో లేదో చూసుకోవాలి.  అలాగే.. మీరు కొనే నగలపై భారత ప్రమాణాల సంస్థ (BIS) లోగో, క్యారెట్, స్వచ్ఛత, 6 అంకెల HUID నంబర్ ఉన్నాయో లేదో చూసుకోవడం తప్పని సరి. హాల్మార్క్ చేసిన ప్రతి నగలకు ఒక ప్రత్యేక HUID నంబర్ ఉంటుంది. మార్చి 31, 2023 తర్వాత 6 అంకెల HUID లేకుండా హాల్మార్క్ చేసిన బంగారు నగలు లేదా బంగారు వస్తువులను విక్రయించడంపై BIS నిషేధం విధించింది.  

34
సులభంగా నాణ్యత తనిఖీ

చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, నగల నాణ్యతను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫోన్ లో BIS Care యాప్ డౌన్లోడ్ చేసుకుని, నగలను జూమ్ చేసి HUID నంబర్ స్కాన్ చేయండి. యాప్ లో HUID నంబర్ ఎంటర్ చేయాలి. నగలను హాల్మార్క్ చేసిన నగల వ్యాపారి, వారి రిజిస్ట్రేషన్ నంబర్, ఆభరణం స్వచ్ఛత, వస్తువు రకం, హాల్మార్కింగ్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. 6 అంకెల HUID బంగారు నగల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. హాల్మార్క్ చేసిన బంగారానికి మంచి మార్కెట్ ధర లభిస్తుంది.

44
ఫిర్యాదు చేయండిలా?

నాణ్యత పరీక్షలో ఏదైనా లోపం కనిపిస్తే, వెంటనే ఫిర్యాదు చేసే హక్కు  కొనుగోలుదారుకు ఉంటుంది. హాల్మార్క్ చేసిన నగలు, నగలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉంటే.. కొనుగోలుదారుడు నష్టపరిహారం పొందవచ్చు. తర్వాత మీరు బంగారం కొనేటప్పుడు, అసలైన బంగారం అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. నాణ్యత పరీక్షించిన తరువాత బంగారం కొనుగోలు చేస్తే మంచిది కదా!

Read more Photos on
click me!

Recommended Stories