AC Usage Tips: ఏసీని ఎన్ని పాయింట్లలో పెడితే కరెంటు బిల్లు తగ్గుతుందో తెలుసా?

Published : Jun 08, 2025, 06:47 PM ISTUpdated : Jun 08, 2025, 06:48 PM IST

సాధారణంగా ఏసీ ఆన్ చేయగానే చాలా మంది 18 డిగ్రీల సెల్సియస్‌లో పెట్టేస్తారు. కాని దీని వల్ల కరెంటు మీటరు ఒక్కసారిగా గిర్రున తిరుతుగుతుంది. నెలాఖరున బిల్లు కూడా భారీగా వస్తుంది. కరెంటు ఆదా చేయాలంటే ఏసీ ఎన్ని పాయింట్లలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఏసీ వల్ల కరెంటు బిల్లు ఎంత వస్తుందంటే..

అప్పుడే తీవ్రమైన వర్షం. మర్నాడే మండిపోయే ఎండ. ఇది ఈ వేసవిలో వాతావరణ పరిస్థితి. అందుకే వేసవి తాపం ఇంకా తగ్గలేదు. బయట తిరిగి ఇంటికి వచ్చిన ఎవరికైనా ఏసీ కింద కూర్చుంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా.. కాని ఇలా అవసరమైనప్పుడల్లా ఏసీ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే బిల్లు మాత్రం రెట్టింపు వస్తుంది. ఏసీ వాడేవారు ఏం చేసినా కరెంటు బిల్లు తగ్గించడం కష్టం. అయితే ఇలా చేస్తే ఈజీగా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. 

25
24 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచండి

ఆఫీసుల్లో ఏసీ వాడేవారు 24 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే ఈ వేసవిలో కరెంటు బిల్లు పెరగకుండా ఆపవచ్చు అని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో చాలామంది తమ ఏసీలను 20 నుంచి 21 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచుతారు. దాన్ని 24 డిగ్రీలకు పెంచితే కరెంటు వినియోగం తగ్గి, బిల్లు బాగా తగ్గుతుందని బీఈఈ సూచించింది.

35
బిల్లు పెరగడానికి ఇదే కారణం

ఏసీలో ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత పెంచినా 6 శాతం కరెంటు ఆదా చేయవచ్చు. 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే ఇళ్లు, ఆఫీసులు చల్లగా ఉంటాయని బీఈఈ తెలిపింది. ఉష్ణోగ్రత తగ్గిస్తే కరెంటు వినియోగం పెరుగుతుందని కూడా చెప్పింది.

45
రూ.5 వేల కోట్లు ఆదా

దేశంలో ఏసీ వాడే వారిలో 50 శాతం మంది 24 డిగ్రీల సెల్సియస్‌ను పాటిస్తే సంవత్సరానికి 1000 కోట్ల యూనిట్ల కరెంటు ఆదా అవుతుంది. ఇది రూ.5,000 కోట్ల ఆదాకు సమానం. అంతేకాకుండా సంవత్సరానికి 8.2 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. దీంతో పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

55
టైమర్ పెట్టుకుంటే బెటర్

పడుకునే ముందు ఏసీ టైమర్‌ని ఆన్ చేసి 1 లేదా 2 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా చూసుకోవచ్చు. ఇలా చేస్తే రాత్రిపూట కరెంటు ఆదా అవుతుంది. తలుపులు, కిటికీలు మూసి ఉండేలా చూసుకోండి. చల్లని గాలి బయటకు పోకుండా ఉంటేనే ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది. లేదంటే కరెంటు ఎక్కువ ఖర్చవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories