UPI Lite X: ఇంటర్నెట్ లేకున్నా మనీ సెండ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?

Published : Jun 07, 2025, 08:35 PM IST

UPI Lite X: ఇంటర్నెట్ లేకున్నా UPI Lite X, *99# సేవలతో మీరు తక్షణంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది NPCI అందించిన వినూత్న ఆఫ్ లైన్ పద్ధతి. ఇంటర్నెట్ లేకుండా ఎలా మనీ సెండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఇండియాలో డిజిటల్ చెల్లింపుల విప్లవం

UPI Lite X: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. అయితే, ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆన్‌లైన్ కనెక్షన్ అవసరం లేకుండా చెల్లింపులు చేయడానికి “UPI Lite X” అనే కొత్త పరిష్కారాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టింది.

25
UPI Lite X అంటే ఏమిటి?

UPI Lite X అనేది మొబైల్ డేటా లేదా Wi-Fi అవసరం లేకుండా పనిచేసే చెల్లింపు విధానం. మీరు ఉపయోగించేందుకు అవసరమయ్యే ప్రధాన అంశాలు:

• మీ స్మార్ట్‌ఫోన్‌లో UPI యాప్ ఉండాలి.

• ఫోన్‌లో NFC (Near Field Communication) ఆప్షన్ ఎనేబుల్ అయి ఉండాలి.

ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు ఏలా చేయాలి?

1. మీ UPI యాప్‌ను ఓపెన్ చేయండి.

2. “Tap & Pay” ఐకాన్‌పై టాప్ చేయండి.

3. పంపాల్సిన మొత్తం ఎంటర్ చేయండి.

4. మీ ఫోన్‌ను గ్రహీత ఫోన్‌కు దగ్గరగా తాకించండి.

5. చెల్లింపు తక్షణమే పూర్తవుతుంది. యూపీఐ లైట్ ఎక్స్ చెల్లింపులకు UPI పిన్ అవసరం లేదు.

ఈ మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తిగా ఆఫ్ లైన్ లో జరుగుతుంది. NFC సాంకేతికత ద్వారా రెండు ఫోన్ల మధ్య డేటా మార్పిడి జరగుతుంది. పంపిన వ్యక్తి లైట్ అకౌంట్ నుండి డబ్బు డెబిట్ అయి, గ్రహీత అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. ఇది సులభమైన, వేగవంతమైన, నమ్మదగిన పద్ధతి.

35
ఇంటర్నెట్ లేదు, NFC లేదు.. చెల్లింపులు ఏలా చేయాలి?

మీ ఫోన్‌లో NFC లేదు. అలాగే, ఆ సమయలో ఇంటర్నెట్ లేదు. ఇలాంటి సమయంలో కూడా మీరు చెల్లింపులు చేయవచ్చు. అలాగే, మీరు ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్నా, మీరు *99# USSD సేవల ద్వారా కూడా ఆఫ్ లైన్ లో చెల్లింపులు చేయవచ్చు. దీని కోసం కింద సూచింని విధంగా చేయండి.

1. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి.

2. స్క్రీన్‌పై కనిపించే మెను ద్వారా చెల్లింపులు చేయండి, బ్యాలెన్స్ చెక్ చేయండి, ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా ఇక్కడ చూడవచ్చు.

45
83 బ్యాంకులు, 4 టెలికాం సంస్థల నుంచి సేవలు

ఈ సేవలు 83 బ్యాంకులు, 4 టెలికాం సంస్థల ద్వారా అందిస్తున్నారు. ఇది 13 భాషల్లో లభించడమే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులకు అందుబాటులో ఉంది.

55
గమనికలు

• *99# ద్వారా ఒక్కసారి ఎక్కువగా రూ.5,000 వరకే పంపగలరు.

• ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.0.50 చార్జీ విధిస్తారు.

ఈ విధంగా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా మీ డిజిటల్ చెల్లింపులు ఆగిపోవాల్సిన అవసరం లేదు. NPCI అందించిన UPI Lite X, USSD ఆధారిత చెల్లింపు విధానాల ద్వారా మీరు ఎక్కడ నుండైనా, ఎప్పుడైనా సురక్షితంగా, వేగంగా చెల్లింపులు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories