మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్ రిస్క్‌లు లేకుండా, ప్రభుత్వ భద్రతతో, పన్ను మినహాయింపుతో మంచి రాబడినిచ్చే పథకం గురించి మీరు తెలుసుకోవాలి. అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) మీరు బెస్ట్ ఆప్షన్.
రిస్క్ లేనివి, నమ్మకమైనవి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు. ముఖ్యంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) తక్కువ రిస్క్‌తో అధిక రాబడినిచ్చే పెట్టుబడి పథకం. దీన్ని మీరు ఏ బ్యాంకులోనైనా, పోస్ట్ ఆఫీసులోనైనా సులభంగా ప్రారంభించవచ్చు. చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఇది చక్కని అవకాశం.
26
దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంది..
NSCకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. PPF, పోస్ట్ ఆఫీస్ దీర్ఘకాలిక డిపాజిట్ల మాదిరిగానే NSC కూడా హామీ ఇచ్చిన వడ్డీ, పూర్తి మూలధన రక్షణను అందిస్తుంది. అయితే టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, NPS వంటి పథకాల్లా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని మాత్రం అందించలేదు. సురక్షితమైన పెట్టుబడికి మాత్రం ఇదే అనువైనది.
36
రూ.1,000 పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరొచ్చు
మీరు కనీసం రూ.1,000 పెట్టుబడితో ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకులు, NBFCల నుండి రుణాలు పొందడానికి హామీగా NSC సర్టిఫికెట్లను ఉపయోగించవచ్చు. ఈ పథకం చక్రవడ్డీ ప్రాతిపదికన పనిచేస్తుంది. అందువల్ల సంపాదించిన వడ్డీని ప్రతి సంవత్సరం తిరిగి పెట్టుబడిగా పెట్టొచ్చు. ఆ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో తిరిగి చెల్లిస్తారు. NSCపై TDS లేదు కాబట్టి పెట్టుబడిదారుడు తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు వర్తించే పన్ను చెల్లించాలి.
NSC ప్రస్తుత ఆర్థిక వివరాలు ఎలా ఉన్నాయంటే.. వడ్డీ రేటు సంవత్సరానికి 7.7% లభిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. ఇందులో మీరు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు కావాలంటే NSCని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకోవచ్చు.
56
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది?
NSCలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే వార్షిక వడ్డీ రేటు 7.7% లభిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. దాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టాలి. ఇలా 5 సంవత్సరాలు పెడితే ఆ తర్వాత మొత్తం రూ.7,24,513 లభిస్తుంది. అంటే లాభం రూ.2,24,513 అన్న మాట.
66
NSCని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు
ప్రభుత్వం నుండి పూర్తి ఆర్థిక భద్రత లభిస్తుంది. మార్కెట్ రిస్క్ ఉండదు. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులు, నష్టాలు NSCలో ఉండవు. పన్ను మినహాయింపు 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. కొత్త పెట్టుబడిదారులైతే కనీసం రూ.1,000తో NSC ప్రారంభించవచ్చు. వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు కూడా తీసుకోవచ్చు.