Saving scheme: 5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌లు సొంతం.. పోస్టాఫీస్‌లో సూప‌ర్ స్కీమ్

Published : May 25, 2025, 11:16 AM ISTUpdated : May 25, 2025, 02:35 PM IST

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. అయితే సేవింగ్స్ ఎక్క‌డ చేయాల‌న్న దానిపై చాలా మందిలో స్ప‌ష్ట‌త ఉండ‌దు. అలాంటి వారి కోస‌మే ఒక మంచి ప‌థ‌కం గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
పెరుగుతోన్న ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌:

ప్ర‌స్తుతం చాలా మందిలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెరుగుతోంది. మారుతోన్న అవ‌స‌రాలు, పెరుగుతోన్న ఖ‌ర్చుల నేప‌థ్యంలో పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే పొదుపు చేసే క్ర‌మంలో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే మార్గాల‌ను అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారి కోస‌మే పోస్టాఫీస్ ర‌క‌ర‌కాల స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న అలాంటి ఒక బెస్ట్ స్కీమ్ ఆర్డీ.

25
అస‌లేంటీ ఆర్‌డీ స్కీమ్‌:

కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ పోస్టాఫీస్ ఈ ఆర్డీ స్కీమ్‌ను అందిస్తోంది. రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌గా చెప్పుకునే ఈ పొదుపు ప‌థ‌కం పెట్టుబడిదారులకు ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడిని అందిస్తుంది. ఈ ప‌థ‌కంలో నెల‌కు రూ. 100 నుంచి పెట్టుబ‌డి పెడుతూ వెళ్లొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా క‌చ్చిత‌మైన రిట‌ర్న్స్ పొందొచ్చు. దీనిపై వచ్చే వడ్డీ ప్రయోజనం స్థిరంగా ఉంటుంది.

ఈ ప‌థ‌కం మెచ్యూరిటీ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు. ఒక‌వేళ మ‌ధ్య‌లో తీసుకోవాలనుకుంటే 3 ఏళ్లు నిండిన త‌ర్వాత తీసుకోవ‌చ్చు. అయితే వ‌డ్డీ త‌గ్గుతుంది. లేదంటే లోన్ కూడా తీసుకోవ‌చ్చు.

35
5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌లు పొందాలంటే.

ఒక‌వేళ మీరు 5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌లు పొందాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంటే మీరు ఆర్డీ ప‌థ‌కంలో నెల‌కు రూ. 20 వేలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఐదేళ్ల పాటు పెట్టుబ‌డి పెడితే మొత్తం రూ. 12,00,000 అవుతుంది. అయితే మీకు సుమారు రూ. 2,27,320 వ‌డ్డీ రూపంలో ల‌భిస్తుంది. ఇలా మొత్తం రూ. 14,27,320 సొంతం చేసుకోవ‌చ్చు.

45
వడ్డీ రేట్లు

అయితే ఇది ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీ రేట్ల ఆధారంగా లెక్కించ‌డం జ‌రిగింది. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో వ‌డ్డీ రేట్ల‌లో మార్పులు జ‌రిగితే మీకు వ‌చ్చే రిట‌ర్న్స్ దానికి అనుగుణంగా మారుతాయి. ప్ర‌స్తుతం ఆర్డీ ప‌థ‌కానికి 6.7 శాతం వ‌డ్డీ ల‌భిస్తోంది.

55
అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.?

RD పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా పోస్టాఫీసుకు వెళ్లి RD అకౌంట్ తెరవడానికి ఫామ్‌ను నింపాలి. దీనికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం అవుతాయి. నామినీ పేరును అందించాల్సి ఉంటుంది. క‌నీసం రూ. 100తో అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. ప్ర‌తీ నెల కొంత మొత్తంలో పొదుపు చేస్తూ వెళ్లే వారికి ఈ ప‌థ‌కం బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories