క్రెడిట్ స్కోర్ పై ప్రభావం డైరెక్ట్ గా ఉండదు..
అయితే చాలా మంది అనుకునే విషయం ఏంటంటే విడాకులు తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని, దీని వల్ల బ్యాంకుల నుంచి ప్రయోజనాలు సరిగ్గా అందవని అనుకుంటారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ నేరుగా తగ్గదు.
కానీ విడాకుల తరువాత వచ్చే ఆర్థిక మార్పుల వల్ల క్రెడిట్ స్కోర్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు భార్యభర్తల్లో ఒకరికి చెందిన క్రెడిట్ కార్డు లేదా లోన్ అకౌంట్ ఇద్దరి పేరిట ఉందనుకోండి. విడాకుల తరువాత దానికి సంబంధించిన చెల్లింపులు సమయానికి జరగకపోతే ఇద్దరి క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం పడుతుంది.