Royal Enfield: అదే రాజసం.. యూత్ ని అట్రాక్ట్ చేసేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

Published : May 14, 2025, 02:26 PM IST

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ మొదటి మోడల్ C6ని బెంగళూరులో ఆవిష్కరించింది. సూపర్ అండ్ స్టైలిష్ లుక్ తో ఈ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ రెట్రో-ఫ్యూచరిస్టిక్ బైక్ ఫీచర్స్, మైలేజ్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
15
Royal Enfield: అదే రాజసం.. యూత్ ని అట్రాక్ట్ చేసేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

సిటీస్ లో మారుతున్న యూత్ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ దాని మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ను బెంగళూరులో ఆవిష్కరించింది. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే చాలా బరువుగా ఉంటుంది అనుకుంటాం కదా... కాని ఫ్లయింగ్ ఫ్లీ C6 తేలికగా ఉంటుంది. స్మార్ట్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్ కారణంగా ఫ్లయింగ్ ఫ్లీ ఎవరికైనా కచ్చితంగా నచ్చుతుంది. 

25

త్వరలో మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ బైక్‌ల డెలివరీలు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ బైక్‌లను ఒక సంవత్సరంలోపు డెలివరీని చేయడం ప్రారంభిస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మరియో అల్విసి తెలిపారు. తమిళనాడులోని వల్లం వడగల్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత ప్రొడక్షన్ యూనిట్ లో తయారీ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. 

35

ఫ్లయింగ్ ఫ్లీ C6 ప్రత్యేక లక్షణాలు ఇవే..

ఫ్లయింగ్ ఫ్లీ C6 అనే పేరుకు తగ్గట్టుగానే ఫ్లయింగ్ ఫ్లీ ఫ్రంట్ సస్పెన్షన్ చాలా స్టైలిష్ గా తయారు చేశారు. ఇందులో ఆర్టిక్యులేటింగ్ మడ్‌గార్డ్, ఫోర్జ్డ్ అల్యూమినియం గిర్డర్ ఫోర్క్ ఉన్నాయి. హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉండేలా దీన్ని రూపొందించారు. డిజైన్ లో ఎలాంటి నాణ్యత లోపాలు రాకుండా రాయల్ కంపెనీ బ్రాండ్ ను నిలబెట్టేలా డిజైన్ ఉందని లాంఛింగ్ వచ్చిన వినియోగదారులు అంటున్నారు. 

45

సొంతంగా బ్యాటరీ తయారీ

బ్యాటరీ టెక్నాలజీని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ అంతర్గతంగా, సొంతంగా అభివృద్ధి చేస్తోంది. కంట్రోలర్లు, మోటార్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్ కోసం దాదాపు 50 తాత్కాలిక పేటెంట్లు సిద్ధంగా ఉన్నాయని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. 

మొదటి దశలో US, యూరోపియన్ మరియు భారతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది.

55

ఫ్లయింగ్ ఫ్లీ C6 భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే సంవత్సరాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి మరికొన్ని మోడల్స్ విడుదల అవుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే మరికొన్ని అప్ డేటెడ్ మోడల్స్ వస్తాయని అంటున్నారు. ప్రస్తుతానికి C6 మోడల్ సిటీ రైడింగ్ కు బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 

 

Read more Photos on
click me!

Recommended Stories