ఆల్టో K10 CNG
ఈ కారు 33.85 కి.మీ/కిలో మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 5.89 లక్షలు. రోజువారీ అవసరాలు తీర్చడంతో పాటు సుదూర ప్రయాణాలకు కూడా మారుతి సుజుకి ఆల్టో K10ని ఉపయోగించవచ్చు. దీని డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో 4 మంది వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది పెట్రోల్‌తో పాటు CNGలో కూడా లభిస్తుంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. అంతేకాకుండా ఇందులో CNG ఆప్షన్ కూడా లభిస్తుంది. CNG మోడ్‌లో 33.85 కి.మీ మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.